Friday, July 10, 2026
Chat on WhatsApp
HomeBusinessDeloitte Hiring | లేఆఫ్స్ ఒకవైపు.. హైరింగ్ మరోవైపు.. భారత్‌పై డెలాయిట్ భారీ ఫోకస్

Deloitte Hiring | లేఆఫ్స్ ఒకవైపు.. హైరింగ్ మరోవైపు.. భారత్‌పై డెలాయిట్ భారీ ఫోకస్

-

Chat on WhatsApp

Deloitte Hiring: టెక్ రంగంలో ఒకవైపు భారీగా ఉద్యోగాల కోతలు కొనసాగుతుండగా, మరోవైపు నియామకాల అవకాశాలు కూడా పెరుగుతున్నాయి. ఇటీవల ఒరాకిల్ ప్రపంచవ్యాప్తంగా సుమారు 30,000 ఉద్యోగాలను తగ్గించినట్లు నివేదికలు వెలువడగా, అదే సమయంలో డెలాయిట్ భారత్‌లో దాదాపు 50,000 మంది నిపుణులను నియమించనున్నట్లు ప్రకటించడం టెక్ ఉద్యోగార్థులకు కొంత ఊరటనిస్తోంది.

ఈ పరిణామాలు AI ప్రభావంతో ఉద్యోగాల స్వభావం ఎంత వేగంగా మారుతున్నదో స్పష్టంగా చూపిస్తున్నాయి. డెలాయిట్ సౌత్ ఆసియా CPO నితిన్ కిని ప్రకారం, AI వల్ల ఉద్యోగాలు పూర్తిగా మాయమవ్వవని, కానీ పనితీరు మారుతుందని కంపెనీ భావిస్తోంది.

అందుకే ఉద్యోగాలను తగ్గించడం కాకుండా, కొత్త నైపుణ్యాలతో ఉద్యోగులను సిద్ధం చేయడంపైనే దృష్టి పెట్టినట్లు తెలిపారు.

ఇప్పటికే సంస్థలో వేలాది మందికి జెనరేటివ్ AI, డేటా, క్లౌడ్, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ స్కిల్స్ పై శిక్షణ ఇస్తుండగా, త్వరలో మరిన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లు కూడా చేపట్టనున్నట్లు వెల్లడించారు.

ఇక మరోవైపు Amazon, Dell, Meta, Oracle వంటి టెక్ దిగ్గజాలు ఖర్చులు తగ్గించడం, AI-కేంద్రిత వ్యూహాలకు మారడం కోసం వేల సంఖ్యలో ఉద్యోగాలను కోత పెట్టాయి.

దీంతో భవిష్యత్తులో సాధారణ టెక్ ఉద్యోగాల కంటే AI, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ, ఆటోమేషన్‌కు సంబంధించిన నైపుణ్యాలకే ఎక్కువ డిమాండ్ ఉండబోతుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి.

మొత్తానికి, టెక్ రంగంలో ఇప్పుడు అసలు ప్రశ్న ఉద్యోగాలు ఉంటాయా అన్నది కాదు.. మారుతున్న టెక్నాలజీకి తగ్గట్టుగా ఎలాంటి నైపుణ్యాలు ఉన్నవారికి అవకాశాలు లభిస్తాయన్నదే కీలకంగా మారింది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

heavy rainfall causes floods and landslides in north indian states

Heavy Rains | భారీ వర్షాలకు ఉత్తరాది అతలాకుతలం.. చార్ ధామ్ యాత్రకు బ్రేక్ ?

Heavy Rains: ఉత్తర భారత రాష్ట్రాలను భారీ వర్షాలు తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కొండచరియలు విరిగిపడి ప్రాణ నష్టం సంభవించింది. పలు...
- Advertisement -
Chat on WhatsApp