Thursday, July 30, 2026
Chat on WhatsApp
HomeInterNationalTrump Warning | హార్ముజ్ మాకు అవసరం లేదు...3 వారాల్లో కఠిన చర్యలు తప్పవు

Trump Warning | హార్ముజ్ మాకు అవసరం లేదు…3 వారాల్లో కఠిన చర్యలు తప్పవు

-

Chat on WhatsApp

Trump Warning: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై మరోసారి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్‌తో ఎలాంటి ఒప్పందం చేసుకునే ప్రసక్తే లేదని, భవిష్యత్‌లో కూడా అలాంటి చర్చలు జరగవని స్పష్టం చేశారు. అమెరికా ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ట్రంప్, రాబోయే రెండు నుంచి మూడు వారాల్లో ఇరాన్‌పై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని హెచ్చరించారు.

అవసరమైతే ఇరాన్ చమురు క్షేత్రాలపై కూడా దాడులు చేయొచ్చని పేర్కొన్నారు. అయితే యుద్ధం ఎక్కువకాలం సాగదని, త్వరగానే ముగుస్తుందనే సంకేతాలు ఇచ్చారు.

ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వస్త్ర శక్తిగా మారడానికి అమెరికా ఒప్పుకోదని ట్రంప్ తేల్చి చెప్పారు. ఇరాన్‌పై ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ కొనసాగుతోందని వెల్లడించారు. హార్ముజ్ జలసంధి విషయంలో అమెరికాకు పెద్దగా ఇబ్బంది లేదని, దానిపై ఆధారపడే దేశాలే తమ ప్రయోజనాలను కాపాడుకోవాలని సూచించారు.

అమెరికా వద్ద చమురు పుష్కలంగా ఉందని, ప్రపంచ దేశాలు తమ దగ్గర నుంచి చమురు కొనుగోలు చేయవచ్చని ట్రంప్ వ్యాఖ్యానించారు.

గల్ఫ్ దేశాల భద్రతకు అమెరికా కట్టుబడి ఉందని ఆయన హామీ ఇచ్చారు. ఇరాన్‌లో తమ లక్ష్యాల సాధనకు అమెరికా చాలా దగ్గరగా ఉందని, త్వరలోనే ఈ ఆపరేషన్ ముగుస్తుందని తెలిపారు. ఇరాన్ నౌకాదళం, వైమానిక దళం, ఐఆర్‌జీసీ కమాండ్ తీవ్రంగా దెబ్బతిన్నాయని చెప్పారు.

ఈ సందర్భంగా వెనిజులాపై కూడా ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ దేశాన్ని వేగవంతమైన చర్యల ద్వారా తమ ప్రభావంలోకి తీసుకువచ్చామని, అక్కడి విస్తారమైన చమురు, గ్యాస్ నిల్వలను అభివృద్ధి చేసి విక్రయించేందుకు కలిసి పనిచేస్తున్నామని వెల్లడించారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Burj Khalifa Introduces UPI Ticket Booking for Indian Tourists

Burj Khalifa | బుర్జ్ ఖలీఫా సందర్శన ఇక మరింత సులభం.. UPIతో ఆన్‌లైన్...

Burj Khalifa: దుబాయ్‌లోని ప్రపంచ ప్రఖ్యాత బుర్జ్ ఖలీఫా సందర్శించాలనుకునే భారతీయ పర్యాటకులకు గుడ్‌న్యూస్. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా సందర్శన కోసం ఇప్పుడు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI)...
- Advertisement -
Chat on WhatsApp