Wednesday, July 1, 2026
Chat on WhatsApp
HomeTelanganaMedakTea Stall Owner | నిజాయితీని చాటుకున్న టీ స్టాల్ యజమాని...అసలు కథ ఏంటి అంటే

Tea Stall Owner | నిజాయితీని చాటుకున్న టీ స్టాల్ యజమాని…అసలు కథ ఏంటి అంటే

-

Chat on WhatsApp

Tea Stall Owner: మెదక్ జిల్లా తూప్రాన్‌( tupran)లో ఓ టీ స్టాల్ నిర్వాహకుడు నిజాయతీతో అందరిని ఆశ్చర్యపరిచాడు. డీఎస్పీ నరేందర్‌గౌడ్‌ చెప్పిన వివరాల గమనిస్తే అల్లాపూర్‌కు చెందిన నర్సింలు శ్రీరామనవమి(sri rama navami) సందర్భంగా తన కుమార్తెకు బంగారు ఆభరణాలు ఇవ్వడానికి ద్విచక్ర వాహనంపై శభాష్‌పల్లికి బయలుదేరారు.

కానీ తూప్రాన్ పట్టణంలో స్పీడ్ బ్రేకర్ వద్ద 9 తులాల బంగారు ఆభరణాల మూట రోడ్డు మీద పడిపోయింది.

సమీపంలో టీ స్టాల్ నిర్వహిస్తున్న నాగరాజు ఆభరణాలను గమనించి సురక్షితంగా దాచారు. తన స్నేహితుడు కృష్ణకు విషయం చెప్పారు. కొంత కాలం వెతికిన తర్వాత, నిజాయతీతో పోలీసుల వద్దకు వెళ్లి ఆభరణాలను సంబంధీకులకు అప్పగించారు.

ఈ నిజాయతీచాటిన ఘటనకు పోలీసులు కూడా ప్రశంసలు తెలిపారు. నాగరాజు, కృష్ణలను ఘనంగా సత్కరించారు. నాగరాజు నిజాయతీచాటిన ఈ ఘటన ప్రజలకు ఆదర్శంగా నిలిచింది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

- Advertisement -
Chat on WhatsApp