Sunday, July 26, 2026
Chat on WhatsApp
HomeInterNationalPakistani F-16 fighter jet | సరిహద్దుల్లో భగ్గుమంటున్న పాక్-అఫ్గాన్ మధ్య ఉద్రిక్తతలు

Pakistani F-16 fighter jet | సరిహద్దుల్లో భగ్గుమంటున్న పాక్-అఫ్గాన్ మధ్య ఉద్రిక్తతలు

-

Chat on WhatsApp

Pakistani F-16: పాక్‌–అఫ్గాన్‌ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు మరింత ఉద్రిక్తం అయింది. ఇరుదేశాల మధ్య కాల్పులు కొనసాగుతున్న వేళ, తమ గగనతలంలోకి చొరబడ్డ పాక్‌కు చెందిన General Dynamics F-16 Fighting Falcon యుద్ధవిమానాన్ని కూల్చివేశామని అఫ్ఘనిస్తాన్ వర్గాలు ప్రకటించినట్లు అక్కడి మీడియా పేర్కొంది.

అఫ్గాన్ భద్రతా దళాల వివరాలను ఆధారంగా తీసుకుని ఈ వార్త బయటకు వచ్చింది. సామాజిక మాధ్యమాల్లో ఓ పాక్ యుద్ధవిమానం మంటల్లో కూలుతున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. అయితే దీనిపై పాకిస్తాన్ నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఇదిలా ఉండగా, అఫ్గాన్ దాడులకు తమ సైన్యం తగిన విధంగా ప్రతిస్పందిస్తున్నదని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ (Shehbaz Sharif) వెల్లడించారు. దురాక్రమణలను అణచివేసే సామర్థ్యం తమ సైన్యానికి ఉందని ఆయన పేర్కొన్నారు.

మరోవైపు పాక్ రక్షణ మంత్రి ఖవాజా అసిఫ్ (Khawaja Asif) భారత్‌పై విమర్శలు గుప్పించారు. అఫ్గాన్ భారత్ ప్రభావంలో పనిచేస్తోందని ఆరోపిస్తూ సామాజిక మాధ్యమ వేదికగా వ్యాఖ్యానించారు. తాలిబన్లు ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదులను ప్రోత్సహిస్తున్నారని కూడా ఆరోపించారు.

అయితే ఈ ఆరోపణలపై స్పష్టత రాలేదు. సరిహద్దు పరిస్థితులు ఉద్రిక్తంగానే కొనసాగుతుండటంతో అంతర్జాతీయ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ALSO READ:Telangana | ఒకే జిల్లాకు గవర్నమెంట్ హోదాలో భార్య, భర్త

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

- Advertisement -
Chat on WhatsApp