Monday, July 27, 2026
Chat on WhatsApp
HomeENTERTAINMENTVirosh Wedding | ఉదయపూర్‌లో ఘనంగా విజయ్–రష్మిక వివాహం...పెళ్లి విందు ప్రత్యేకతలు

Virosh Wedding | ఉదయపూర్‌లో ఘనంగా విజయ్–రష్మిక వివాహం…పెళ్లి విందు ప్రత్యేకతలు

-

Chat on WhatsApp

Virosh Wedding: టాలీవుడ్ ప్రముఖులు విజయ్ దేవరకొండ,- రష్మిక మందన్న (Vijay Deverakonda – Rashmika Mandanna) వివాహ బంధంతో ఒక్కటయ్యారు. రాజస్థాన్‌లోని ఉదయపూర్ లో వేద మంత్రోచ్చారణల మధ్య ఉదయం 10 గంటల 10 నిమిషాలకు విజయ్, రష్మిక మెడలో తాళి కట్టారు.

అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ వేడుకలో హిందూ సంప్రదాయాలు ఘనంగా నిర్వహించారు. సాయంత్రం కర్ణాటక కుటుంబ ఆచారాల ప్రకారం మరోసారి వివాహ కార్యక్రమం జరగనుండగా, మార్చి 4న హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు.

వివాహ విందు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తెలంగాణ రుచులకు ప్రాధాన్యం ఇస్తూ హైదరాబాద్ దమ్ బిర్యానీ, మటన్ బిర్యానీ వడ్డించారు. నాటుకోడి పులుసు, గారెలు, పప్పు, పచ్చిపులుసు, ఓల్డ్ సిటీ కీమా సమోసాలు అతిథులను ఆకట్టుకున్నాయి.

రష్మిక స్వస్థలం కూర్గ్ సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తూ కర్రీను బియ్యం రొట్టెలతో వడ్డించారు. కర్ణాటక ప్రత్యేక వంటకాలైన బిసిబేలె బాత్, మైసూర్ పాక్ తీపి రుచిని జోడించాయి. రెండు రాష్ట్రాల సంస్కృతి, వంటకాలను మేళవించిన ఈ వివాహ వేడుక అభిమానులకు మధుర జ్ఞాపకంగా నిలిచింది.

ALSO READ:India semi final qualification | భారత్ సెమీస్ చేరాలంటే నాలుగు అవకాశాలు ఇవే..?

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

- Advertisement -
Chat on WhatsApp