Saturday, July 25, 2026
Chat on WhatsApp
HomeAndhra PradeshMLA, MLC Sports | ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలు..ఎక్కడంటే ?

MLA, MLC Sports | ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలు..ఎక్కడంటే ?

-

Chat on WhatsApp

MLA, MLC Sports: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం ప్రత్యేక క్రీడా పోటీలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ క్రీడా వేడుకలు అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం విజయవాడలోని “ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం” (Indira Gandhi Municipal Stadium)లో నిర్వహించనున్నారు.

దీనికి ప్రధాన కారణం సభ్యుల్లో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడం, పరస్పర స్నేహబంధాలను బలోపేతం చేయడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

ఇప్పటికే శాసనసభా పక్ష కార్యాలయాల్లో నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. సభ్యులు తమకు నచ్చిన క్రీడలను ఎంపిక చేసుకునే అవకాశం కల్పించారు.

క్రికెట్, క్యారమ్స్, చెస్, టెన్నిస్ తదితర క్రీడల్లో పోటీలు నిర్వహించనున్నారు. పాల్గొనే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఉచితంగా టీ-షర్టులు, ట్రాక్సూట్లు అందజేయనున్నారు. ముఖ్యంగా క్రికెట్ పోటీలపై అధిక ఆసక్తి కనిపిస్తోంది.

రెండు జట్లుగా విభజించి మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. ఒక జట్టుకు మంత్రి నారాలోకేష్ (Nara Lokesh) కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, మరో జట్టుకు మంత్రి నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) సారథ్యం వహించనున్నారు.

సభ్యుల సంఖ్య పెరిగితే మూడో జట్టు ఏర్పాటు చేసే అవకాశముంది. ఆ జట్టుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కెప్టెన్‌గా ఉండే అవకాశం కనిపిస్తోంది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

- Advertisement -
Chat on WhatsApp