Friday, July 24, 2026
Chat on WhatsApp
HomeEducation NewsSBI CBO Recruitment 2026 | గ్రాడ్యుయేట్లకు శుభవార్త.. SBIలో 2273 ఉద్యోగాలు

SBI CBO Recruitment 2026 | గ్రాడ్యుయేట్లకు శుభవార్త.. SBIలో 2273 ఉద్యోగాలు

-

Chat on WhatsApp

SBI CBO Recruitment 2026: దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ State Bank of India (SBI) 2026 సంవత్సరానికి భారీ నియామక ప్రక్రియ ప్రారంభించింది. మొత్తం 2273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ (CBO) ఖాళీలను ఈ నియామక ప్రక్రియ ద్వారా భర్తీ చేయనున్నారు.

ముందుగా దరఖాస్తుల చివరి తేదీ ఫిబ్రవరి 18గా నిర్ణయించినప్పటికీ, అభ్యర్థుల సౌకర్యార్థం గడువును ఫిబ్రవరి 25, 2026 వరకు పొడిగించారు. బ్యాంకింగ్ రంగంలో స్థిరమైన ఉద్యోగం కోరుకునే గ్రాడ్యుయేట్లకు ఇది మంచి అవకాశం.

మొత్తం 2273 ఖాళీలలో 2050 రెగ్యులర్ పోస్టులు, 223 బ్యాక్‌లాగ్ ఖాళీలు ఉన్నాయి. మహారాష్ట్ర, అహ్మదాబాద్, బెంగళూరు, చండీగఢ్, చెన్నై, కోల్‌కతా వంటి పలు సర్కిళ్లలో నియామకాలు జరుగనున్నాయి.

గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేయవచ్చు. మెడికల్, ఇంజనీరింగ్, CA అభ్యర్థులు కూడా అర్హులు.

డిసెంబర్ 31, 2025 నాటికి షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ లేదా RRBలో కనీసం రెండేళ్ల అధికార అనుభవం ఉండాలి. వయోపరిమితి 21 నుంచి 30 సంవత్సరాలు (నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది). ఎంపిక ప్రక్రియలో ఆన్‌లైన్ రాత పరీక్ష, పత్రాల పరిశీలన, ఇంటర్వ్యూ, స్థానిక భాషా పరీక్ష ఉంటాయి.

జనరల్/OBC/EWS అభ్యర్థులకు ₹750 ఫీజు ఉండగా, SC/ST/దివ్యాంగులకు ఫీజు మినహాయింపు ఉంది. ఆసక్తిగల అభ్యర్థులు ఫిబ్రవరి 25, 2026 లోపు SBI అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ దరఖాస్తు చేయాలి.

ALSO READ:Swachha Rathams | చెత్తను  ఇవ్వండి.. నిత్యావసరాలు పొందండి…ప్రజలకు సీఎం సందేశం

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Landslide hit a Tata Sumo in Himachal Pradesh's Lahaul-Spiti district.

Himachal Pradesh | హిమాచల్‌లో ప్రకృతి బీభత్సం.. టాక్సీపై విరిగిపడ్డ కొండచరియలు, పలువురు మృతి

Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్‌లో విషాదం చోటుచేసుకుంది. శుక్రవారం లాహౌల్-స్పితిలో ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడటంతో టాటా సుమో టాక్సీ శిథిలాల కింద చిక్కుకుంది. ఈ ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఉదయ్‌పూర్-కిలార్...
- Advertisement -
Chat on WhatsApp