Friday, July 24, 2026
Chat on WhatsApp
HomeUncategorizedAnthropic AI | ఆంథ్రోపిక్ షాక్...కుప్పకూలిన సైబర్ సెక్యూరిటీ షేర్లు

Anthropic AI | ఆంథ్రోపిక్ షాక్…కుప్పకూలిన సైబర్ సెక్యూరిటీ షేర్లు

-

Chat on WhatsApp

Anthropic AI: అమెరికాకు చెందిన ఏఐ స్టార్టప్ ఆంథ్రోపిక్ (Anthropic) తాజా ప్రకటనతో అమెరికా స్టాక్ మార్కెట్లలో భారీ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. కంపెనీ విడుదల చేసిన సోషల్ మీడియా పోస్ట్ కారణంగా సైబర్ సెక్యూరిటీ రంగానికి చెందిన ప్రముఖ కంపెనీల షేర్లు క్షణాల్లో కుదేలయ్యాయి. మార్కెట్ అంచనాల ప్రకారం దాదాపు 10 బిలియన్ డాలర్ల మేర మదుపర్ల సంపద ఆవిరైందని తెలుస్తోంది.

ఆంథ్రోపిక్ తన ఏఐ మోడల్ ‘క్లాడ్’(Claude) ఆధారంగా ‘క్లాడ్ కోడ్ సెక్యూరిటీ’ అనే కొత్త ఫీచర్‌ను ప్రకటించింది. ఈ టూల్ సాఫ్ట్‌వేర్ కోడ్‌బేస్‌లను స్కాన్ చేసి అందులోని భద్రతా లోపాలను గుర్తిస్తుంది. అంతేకాకుండా, ఆ లోపాలను ఎలా సరిచేయాలో డెవలపర్లకు సూచనలు కూడా అందిస్తుంది.

కోడింగ్ దశలోనే సెక్యూరిటీ లోపాలను గుర్తించి పరిష్కరించేందుకు ఇది సహాయపడుతుందని కంపెనీ పేర్కొంది. సంప్రదాయ సైబర్ సెక్యూరిటీ టూల్స్ గుర్తించలేని బలహీనతలను కూడా ఇది గుర్తించగలదని వెల్లడించింది. ప్రస్తుతం ఈ ఫీచర్ పరిశీలన దశలో ఉంది.

ఈ ప్రకటనతో సైబర్ సెక్యూరిటీ రంగానికి చెందిన క్రౌడ్‌స్ట్రైక్, క్లౌడ్‌ఫ్లేర్, స్కేలర్, సెయిల్‌పాయింట్, ఒక్టా వంటి కంపెనీల షేర్లు 5 నుంచి 9 శాతం వరకు పడిపోయాయి. గిట్‌ల్యాబ్, జెఫ్రాగ్ వంటి సాఫ్ట్‌వేర్ సంస్థల షేర్లు కూడా క్షీణించాయి.

గ్లోబల్ ఎక్స్ సైబర్ సెక్యూరిటీ ఈటీఎఫ్ సుమారు 5 శాతం పడిపోవడం మార్కెట్‌లో ఆందోళనకు దారితీసింది. ఏఐ ఆధారిత సెక్యూరిటీ టూల్స్ భవిష్యత్తులో సాంప్రదాయ సైబర్ సెక్యూరిటీ వ్యాపార నమూనాలను ప్రభావితం చేయవచ్చన్న ఆందోళన మదుపర్లలో స్పష్టంగా కనిపిస్తోంది.

ALSO READ:Allu Sirish Pre Wedding Party | దుబాయ్ బ్యాచిలర్ పార్టీ తర్వాత హైదరాబాద్‌లో గ్రాండ్ విందు

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Chandrababu Naidu

Amaravati | చంద్రబాబు విజన్‌కు మరో రూపం.. అమరావతిలో క్వాంటం ఫైనాన్స్ సెంటర్

Amaravati: అమరావతిని ప్రపంచస్థాయి సాంకేతిక కేంద్రంగా తీర్చిదిద్దే ప్రయత్నాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. అమరావతి క్వాంటం వ్యాలీలో "క్వాంటం ఫైనాన్స్ ఇన్నోవేషన్ హబ్" ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం, పంజాబ్ నేషనల్...
- Advertisement -
Chat on WhatsApp