Sunday, April 12, 2026
Chat on WhatsApp
HomeInterNationalTrump tariffs | అమెరికా–భారత్ ట్రేడ్‌ డీల్‌లో మార్పులు...10% సుంకాలు అమల్లో

Trump tariffs | అమెరికా–భారత్ ట్రేడ్‌ డీల్‌లో మార్పులు…10% సుంకాలు అమల్లో

-

Chat on WhatsApp

Trump tariffs: అమెరికా సుప్రీంకోర్టు ఇటీవల ట్రంప్‌ విధించిన టారిఫ్‌లను రద్దు చేసిన తర్వాత, భారత్‌ సహా పలు వాణిజ్య భాగస్వామ్య దేశాలపై ట్రేడ్‌ డీల్స్‌లో (Trade Deals) మార్పులు చోటుచేసుకోవడంమొదలైయింది. వైట్‌హౌస్ ప్రకటించిన ప్రకారం, ప్రపంచంలోని అన్ని దేశాలపై 10% సుంకాలు (Tariffs) వర్తించనున్నాయి.

భారత్‌పై ఇప్పటికే 18% ఉన్న టారిఫ్‌లు ఈ నిర్ణయంతో 10%కు పడిపోతున్నాయి. ఈ సుంకాలు ఫిబ్రవరి 24 నుంచి 150 రోజుల పాటు అమల్లో ఉంటాయి.

గతంలో ట్రంప్‌ అధికారంలోకి రాగానే భారత్‌పై 25% సుంకాలు విధించబడ్డాయి. రష్యా చమురు కొనుగోలును కారణంగా మరో 25% అదనపు టారిఫ్‌లు వేశారు.

ఈ క్రమంలో మన దేశంపై మొత్తం 50% టారిఫ్‌లు ఏర్పడినవి. ఆ తర్వాత భారత్‌తో అమెరికా మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందానికి ఫ్రేమ్‌వర్క్‌ రూపొందించడంతో 50% నుండి 18%కు తగ్గాయి.

ఇప్పటి సుప్రీంకోర్టు తీర్పుతో 18% టారిఫ్‌లు రద్దు కాని స్థితిలో, 10% సుంకాలు 150 రోజుల పాటు అమల్లో ఉంటాయి. ట్రంప్‌ సర్కారు అవసరమైతే సుంకాలను మరింత పెంచే ప్రయత్నంలో ఉన్నది. స్విట్జర్లాండ్‌, దక్షిణ కొరియా, ఐరోపా సమాఖ్య, జపాన్‌, లిచెన్‌స్టీన్‌ 15% టారిఫ్‌లకు ఒప్పందం కుదుర్చుకున్నా, సుప్రీంకోర్టు తీర్పుతో 10%కి తగ్గనున్నాయి.

వియత్నాంపై 20% సుంకాలు 10%కి పడిపోతాయి. ఈ పరిణామాల కారణంగా భారత్ మరియు ఇతర దేశాల వ్యాపార వర్గాలు రేపటి వ్యాపార వ్యూహాలను మళ్లీ సర్దుబాటు చేయాల్సి ఉంటుంది.

ALSO READ:Anupama & Dhruv Dating | అనుపమ-ధృవ్ స్నేహమా, ప్రేమమా?

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

PM Modi addressing a public rally in West Bengal during election campaign

PM Modi | ఆడబిడ్డల భద్రత పై మోడీ ధ్వజం .. ఎన్నికల ప్రసంగంలో...

PM Modi: పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రంలో ఆడబిడ్డలకు భద్రత లభిస్తుందని ఆయన అన్నారు. పూర్బ బర్ధమాన్,...
- Advertisement -
Chat on WhatsApp