Friday, August 7, 2026
Chat on WhatsApp
HomeNewsSmartphones | మొబైల్ కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్‌.. ధరలు తగ్గే ఛాన్స్‌

Smartphones | మొబైల్ కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్‌.. ధరలు తగ్గే ఛాన్స్‌

-

Chat on WhatsApp

Budget 2026: సామాన్య ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. బడ్జెట్ 2026లో స్మార్ట్‌ఫోన్లు, టీవీల తయారీలో ఉపయోగించే కీలక విడిభాగాలపై కస్టమ్స్ డ్యూటీని తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో రానున్న రోజుల్లో స్మార్ట్‌ఫోన్లు( Smartphones), టీవీల ధరలు తగ్గే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

రోజువారీ జీవితంలో మొబైల్, టీవీ ప్రతి ఇంట్లో అవసరంగా మారిన నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రజలకు పెద్ద ఊరటగా భావిస్తున్నారు. టీవీలు, స్మార్ట్‌ఫోన్ల తయారీకి అవసరమైన చాలా విడిభాగాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది.

వీటిపై ఉన్న కస్టమ్స్ డ్యూటీ తగ్గడంతో తయారీ ఖర్చులు తగ్గి, ఆ ప్రభావం ధరలపై పడే అవకాశం ఉంది. దీంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ఆర్థికంగా కొంత భారం తగ్గనుంది.

ఇదే కాకుండా వంటగదిలో ఉపయోగించే మైక్రోవేవ్ ఓవెన్లపై కూడా కస్టమ్స్ డ్యూటీ తగ్గించడంతో వాటి ధరలు త్వరలో తగ్గనున్నాయి. చెప్పులు, లెదర్ ఉత్పత్తులు, వీడియో గేమ్స్ తయారీకి ఉపయోగించే విడిభాగాలపై కూడా పన్ను రాయితీలు ప్రకటించారు. అలాగే ఈవీ బ్యాటరీల ధరలు తగ్గే అవకాశం ఉండగా, 17 రకాల క్యాన్సర్ మందులపై ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీ తగ్గించడంతో రోగులకు మరింత ఊరట కలగనుంది.

అయితే అన్ని వస్తువుల ధరలు తగ్గవు. బొగ్గు, కాఫీ, వెండింగ్ మిషన్లు, సిగరెట్లు, విదేశీ మద్యం, పాన్ మసాలా వంటి వాటి ధరలు పెరగనున్నాయి. బడ్జెట్ నిర్ణయాలు ఏప్రిల్ నుంచి అమల్లోకి రానుండటంతో, ధరల మార్పులు మెల్లగా కనిపించనున్నాయి. మొత్తంగా ఈ బడ్జెట్‌లో కొన్ని రంగాలకు లాభం చేకూరగా, మరికొన్ని రంగాలపై ప్రభావం పడనుంది.

బడ్జెట్ 2026లో కేంద్ర ప్రభుత్వం కస్టమ్స్ డ్యూటీ తగ్గించడంతో స్మార్ట్‌ఫోన్లు, టీవీలు, మైక్రోవేవ్ ఓవెన్ల ధరలు తగ్గే అవకాశం ఉంది. సామాన్యులకు బిగ్ రిలీఫ్.

also read:Jammu and Kashmir Earthquake | జమ్ముకశ్మీర్‌లో భూకంపం.. తెల్లవారుజామున భయాందోళన

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Indian chess Grandmaster Praggnanandhaa

Praggnanandhaa | 20 ఏళ్ల వయసులో అరుదైన ఘనత..  ప్రజ్ఞానంద ఖాతాలో మరో ప్రతిష్టాత్మక టైటిల్!

Praggnanandhaa: చదరంగ ప్రపంచంలో మరోసారి భారత జెండాను రెపరెపలాడించాడు యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద. కేవలం 20 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ వేదికపై తన సత్తా చాటుతూ మరో ప్రతిష్టాత్మక విజయాన్ని అందుకున్నాడు. అమెరికాలో...
- Advertisement -
Chat on WhatsApp