Thursday, July 23, 2026
Chat on WhatsApp
HomeJammu & KashmirJammu Kashmir Accident | దోడా జిల్లాలో ఘోర ప్రమాదం.. లోయలో పడిన ఆర్మీ వాహనం

Jammu Kashmir Accident | దోడా జిల్లాలో ఘోర ప్రమాదం.. లోయలో పడిన ఆర్మీ వాహనం

-

Chat on WhatsApp

Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌లోని దోడా జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భద్రతా సిబ్బందిని తరలిస్తున్న ఆర్మీ వాహనం అదుపుతప్పి లోయలో పడటంతో 10 మంది భారత ఆర్మీ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరికొందరు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు.

భదేర్వాహ్–చంబా రహదారిలోని ఖన్నీ పర్వత ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. లోయలో పడిపోయిన బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనంలో మొత్తం 17 మంది భద్రతా సిబ్బంది ప్రయాణిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

ప్రమాదం జరిగిన వెంటనే ఆర్మీ, పోలీసులు సంయుక్తంగా రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు.

also read:Manchu Manoj | మాస్ అవతార్‌లో మంచు మనోజ్.. ‘డేవిడ్ రెడ్డి’ ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ప్రకటన

గాయపడిన సిబ్బందిని తక్షణమే ఉధంపుర్‌లోని మిలిటరీ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.

పర్వత ప్రాంతంలో వర్షాలు, రహదారి పరిస్థితుల కారణంగానే వాహనం అదుపుతప్పి ఉండవచ్చని ప్రాథమిక అంచనా వేస్తున్నారు.

ఈ ఘటనపై ఉన్నతాధికారులు దిగ్భ్రాంతి వ్యక్తం చేయగా, మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

NEET Students Dance | ఇది నిరసననా.. లేక రైన్ డాన్స్ ఆ.. నిరసన...

NEET Students Dance: నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా బిహార్ రాజధాని పాట్నాలో కూడా విద్యార్థి సంఘాలు భారీ ఆందోళన చేపట్టాయి. వివిధ రాజకీయ పార్టీలకు...
- Advertisement -
Chat on WhatsApp