Tuesday, March 17, 2026
No menu items!
Home Andhra Pradesh Pawan Kalyan | ఇచ్చిన మాట నిలబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..జనసైనికులకు అండగా

Pawan Kalyan | ఇచ్చిన మాట నిలబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..జనసైనికులకు అండగా

0
33
Deputy CM Pawan Kalyan consoles and supports Jana Sena workers’ families
Deputy CM Pawan Kalyan consoles and supports Jana Sena workers’ families

Jana Sena News: అడిగిన వారికీ లేదు అనకుండా సాయం చేసేది ఎవరైనా ఉన్నారు అంటే అది జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవణ్ కళ్యాణ్ ఒక్కడే.. ఆయన మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు.

మంగళగిరి, కృష్ణా జిల్లాల్లో పర్యటించిన ఆయన, గతంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ నేనున్నాను అంటూ భరోసా కల్పిస్తూ జనసేన కార్యకర్తల కుటుంబాలను వ్యక్తిగతంగా కలిసి సాయం అందించారు. బీమా పరిహారం, ఆర్థిక సాయం, ఉద్యోగ హామీలతో బాధిత కుటుంబాలకు భరోసా ఇచ్చారు.

గత నెలలో మంగళగిరి(Mangalagiri) నియోజకవర్గంలో వైసీపీ పాలన సమయంలో జనసేన ప్లీనరీ కోసం భూములు ఇచ్చిన కారణంగా ఇళ్లను కోల్పోయిన కుటుంబాలను పవన్ కళ్యాణ్ పరామర్శించారు.

ఆ సమయంలో స‌రస్వతమ్మ ఇంటికి వస్తానని ఇచ్చిన మాట ప్రకారం, డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆమె ఇంటికి వెళ్లి ఆశీర్వాదాలు అందించారు.

also read:70 Years Old UP Man First Vlog Goes Viral: తొలి వీడియోతోనే సంచలనం సృష్టించిన 70 ఏళ్ల తాత

ఇక ఉమ్మడి కృష్ణా జిల్లాలోని కృత్తివెన్నుకు చెందిన జనసేన క్రియాశీలక సభ్యుడు చందు వీరవెంకట వసంతరాయల కుటుంబాన్ని కూడా పవన్ కళ్యాణ్ పరామర్శించారు.

ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన చందు కుటుంబానికి పార్టీ తరఫున, వ్యక్తిగతంగా బీమా పరిహారం, ఆర్థిక సాయం అందించారు. అలాగే, ప్రభుత్వ స్థాయిలో సహాయం, ఉద్యోగ అవకాశాలపై హామీలు ఇచ్చారు.

చందు అవయవ దానంలో కీలక పాత్ర పోషించినందుకు ఆయన కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ అభినందించి నివాళులు అర్పించారు. ఈ పర్యటనను గోప్యంగా నిర్వహించినప్పటికీ, వేలాది మంది అభిమానులు, పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు.

ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడమే కాక, నిజమైన నాయకత్వం, మానవత్వాన్ని పవన్ కళ్యాణ్ చూపించారని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

YouTube thumbnailYouTube icon