Friday, August 7, 2026
Chat on WhatsApp
HomeNationalIndia New Spy Satellites | 50కి పైగా కొత్త స్పై శాటిలైట్ల ప్రయోగానికి గ్రీన్ సిగ్నల్

India New Spy Satellites | 50కి పైగా కొత్త స్పై శాటిలైట్ల ప్రయోగానికి గ్రీన్ సిగ్నల్

-

Chat on WhatsApp

Spy Satellites Boos: ఇటీవల జరిగిన సైనిక ఉద్రిక్తతల్లో నిఘా పరిమితులు స్పష్టంగా వెలుగులోకి రావడంతో, భారత్ తన అంతరిక్ష ఆధారిత భద్రతా వ్యవస్థను భారీగా విస్తరించేందుకు సిద్ధమవుతోంది.

రాత్రి వేళల్లోనూ, మేఘావృత వాతావరణంలోనూ స్పష్టమైన చిత్రాలు అందించే సామర్థ్యంతో 50కి పైగా కొత్త గూఢచారి ఉపగ్రహాలను ప్రయోగించాలన్న యోచనలో ఉన్నట్లు ఓ నివేదిక వెల్లడించింది.

గతేడాది మే 7 నుంచి మే 10 వరకు పాకిస్తాన్‌తో జరిగిన నాలుగు రోజుల సైనిక ప్రతిష్టంభనలో భారత ఉపగ్రహాల పరిమితులు బయటపడ్డాయి. లక్ష్యాలను గుర్తించడంలో ఉపగ్రహాలు కీలక పాత్ర పోషించినప్పటికీ, రాత్రి వేళల్లో మరియు దట్టమైన మేఘాల మధ్య ఆశించిన స్థాయిలో పనిచేయలేకపోయాయి.

దీంతో కొన్ని సందర్భాల్లో భారత్‌కు రోజుల తరబడి ఖచ్చితమైన నిఘా సమాచారం అందలేదు.

ఈ లోపాల కారణంగా అమెరికాకు చెందిన ప్రైవేట్ సంస్థల నుంచి ఉపగ్రహ చిత్రాలను కొనుగోలు చేయాల్సి వచ్చిందని బ్లూమ్‌బర్గ్ నివేదిక పేర్కొంది.

ఇదే సమయంలో, తక్కువ ఉపగ్రహాలు ఉన్నప్పటికీ పాకిస్తాన్‌కు చైనా ఉపగ్రహాల మద్దతు లభించడం భారత్‌ను అప్రమత్తం చేసింది.

ఇప్పటివరకు వినియోగిస్తున్న ఎలక్ట్రో–ఆప్టికల్ ఇమేజింగ్‌కు బదులుగా, సింథటిక్ అపర్చర్ రాడార్ (SAR) టెక్నాలజీని భారత్ విస్తృతంగా ఉపయోగించనుంది. ఈ సాంకేతికతతో అన్ని వాతావరణాల్లోనూ నిరంతర నిఘా సాధ్యమవుతుందని అధికారులు భావిస్తున్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Shubman Gill injured during practice session before India's Sri Lanka Test series.

Sri Lanka Test 2026 | శ్రీలంక టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ.....

Sri Lanka Test 2026: శ్రీలంక పర్యటనకు సిద్ధమవుతున్న టీమిండియాకు అనుకోని షాక్ తగిలింది. టెస్టు జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గాయపడటంతో, శ్రీలంక క్రికెట్ బోర్డు ఎలెవన్‌తో జరుగుతున్న మూడు రోజుల...
- Advertisement -
Chat on WhatsApp