Wednesday, July 22, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshఇచ్చిన మాట నిలబెట్టుకున్న లోకేష్

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లోకేష్

-

Chat on WhatsApp

మంగళగిరి: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లోకేష్…ఇక వివరాల్లోకి వెళ్తే 

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి నిమ్మల రామానాయుడు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను అభినందించేందుకు కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం చెన్నూరు గ్రామానికి చెందిన దివ్యాంగుడు మెర్ల వెంకటేశ్వరరావు ఆటోలో పాలకొల్లుకు వచ్చారు.

ఈ సందర్భంగా విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆయనకు అండగా నిలిచారు.

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ప్రజాదర్బార్‌లో లోకేష్ స్వయంగా వెంకటేశ్వరరావును కలుసుకొని, ఇచ్చిన హామీ ప్రకారం ట్రై స్కూటీని అందజేశారు.

ALSO READ:సిట్ విచారణకు డుమ్మా కొట్టిన సుబ్బారెడ్డి

గత నెలలో పాలకొల్లులో మంత్రి నిమ్మల కార్యాలయాన్ని సందర్శించినప్పుడు, చంద్రబాబుతో ఫోటో దిగాలనే కోరికను వెంకటేశ్వరరావు వ్యక్తం చేశారు.

దాంతో, నిమ్మల రామానాయుడు ఆ కోరికను నెరవేర్చుతానని, అలాగే ట్రై సైకిల్ అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ ఘటనపై స్పందించిన మంత్రి నారా లోకేష్, దివ్యాంగుడి ధైర్యసాహసాన్ని మెచ్చుకొని తన వ్యక్తిగత నిధులతో ట్రై స్కూటీ అందజేస్తానని మాట ఇచ్చారు.

నేడు ఆ మాటను నిలబెట్టి స్కూటీని స్వయంగా అందజేశారు.ట్రై స్కూటీ అందుకున్న వెంకటేశ్వరరావు ఆనందం వ్యక్తం చేస్తూ, మంత్రి లోకేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

NEET Protests Explained: Why CJP's Delhi Agitation Sparked Controversy

NEET Controversy | నీట్ నిరసనలు ఎందుకు వివాదాస్పదమయ్యాయి? అసలు ఏం జరిగింది?

NEET Controversy: నీట్ (NEET) ప్రశ్నాపత్రం లీక్ ఆరోపణలపై ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) చేపట్టిన నిరసనలు ఇటీవల తీవ్ర చర్చకు దారితీశాయి. విద్యార్థులకు న్యాయం చేయాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర...
- Advertisement -
Chat on WhatsApp