Thursday, July 2, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshవిద్యార్థులకు ప్రత్యేక కిట్ పంపిణీ, రూ.953 కోట్లు ఖర్చు

విద్యార్థులకు ప్రత్యేక కిట్ పంపిణీ, రూ.953 కోట్లు ఖర్చు

-

Chat on WhatsApp

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం ప్రత్యేక కిట్ లను పంపిణీ చేయనుంది. ఈ కొత్త పథకం పేరు “సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పథకం”. దీనికోసం ఏటా రూ.953.71 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం ద్వారా 35,94,774 మంది విద్యార్థులకు ప్రయోజనాలు కలుగుతాయని అధికారులు తెలిపారు. ఈ పథకాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమలు చేయాలని నిర్ణయించబడింది.

ఈ కిట్ లో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, వర్క్ బుక్స్, నోటు బుక్స్, బెల్ట్, బూట్లు, బ్యాగ్, డిక్షనరీ మరియు మూడు జతల యూనిఫామ్లు ఉంటాయి. ఒక కిట్ ధర సగటున రూ.1,858 ఉంటుందని అధికారులు తెలిపారు. ఇందులో, 8వ తరగతి వరకు విద్యార్థుల కోసం రూ.120 మేర యూనిఫాం ఖర్చు, 9వ, 10వ తరగతుల విద్యార్థులకు మాత్రం రూ.240 చొప్పున ఖర్చు చేయనుంది. ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయడం ద్వారా విద్యార్థుల విద్యా సంబంధిత అవసరాలను తీర్చడంతో పాటు, వారికి అవసరమైన సామాగ్రి అందించడంతో విద్యార్థుల చదువుకు మరింత ప్రోత్సాహం కలుగుతుందని భావిస్తోంది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

whatsapp username feature explained by meta with security and privacy details

WhatsAppలో Username ఫీచర్.. యూజర్ల సందేహాలకు Meta ఫుల్ క్లారిటీ

WhatsApp Username: వాట్సాప్‌లో త్వరలో ప్రవేశపెట్టనున్న Username Feature గురించి వినియోగదారుల్లో నెలకొన్న సందేహాలకు మెటా స్పష్టత ఇచ్చింది. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే గోప్యత, భద్రతపై ఎలాంటి ప్రభావం ఉంటుందనే చర్చ...
- Advertisement -
Chat on WhatsApp