Sunday, July 12, 2026
Chat on WhatsApp
HomeTelanganaHyderabadరామగుండం ఎన్టీపీసీ ఫేజ్-2 వేగవంతం చేయండి: సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి...

రామగుండం ఎన్టీపీసీ ఫేజ్-2 వేగవంతం చేయండి: సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ

-

Chat on WhatsApp

తెలంగాణ రాష్ట్రంలో నానాటికీ పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, రామగుండం ఎన్టీపీసీ (NTPC) రెండో దశ ప్రాజెక్టును వేగవంతం చేయాలని కోరుతూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని (PPA) త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన ఆ లేఖలో కోరారు. సెకండ్ ఫేజ్‌లో భాగంగా 3X800 మెగావాట్ల సామర్థ్యంతో మొత్తం 2,400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ఎన్టీపీసీ ఇప్పటికే చర్యలు చేపట్టిందని కేంద్ర మంత్రి తెలిపారు. మొదటి దశ తరహాలోనే, ఈ రెండో దశ ప్రాజెక్టులో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌లో సైతం 85 శాతం తెలంగాణకే సరఫరా కానుందని ఆయన స్పష్టం చేశారు. అధునాతన అల్ట్రా సూపర్ క్రిటికల్ సాంకేతికతతో నిర్మించనున్న ఈ ప్రాజెక్టు ద్వారా, తక్కువ ఖర్చుతోనే నాణ్యమైన విద్యుత్ రాష్ట్రానికి అందుబాటులోకి వస్తుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

ins-mahendragiri-inducted-into-indian-navy-rajnath-singh

Rajnath Singh | సముద్రంలో భారత్‌కు తిరుగులేదు.. రాజ్‌నాథ్ సింగ్ కీలక ప్రకటన

Rajnath Singh: భారత సముద్ర భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా మరో కీలక అడుగు పడింది. విశాఖపట్నంలోని నావల్ డాక్‌యార్డ్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి భారత నౌకాదళంలో కొత్తగా...
- Advertisement -
Chat on WhatsApp