Saturday, July 11, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshఏపీ టీచర్లకు డబుల్ గుడ్ న్యూస్.. కేసుల ఎత్తివేతతో పాటు హాజరులో మినహాయింపు

ఏపీ టీచర్లకు డబుల్ గుడ్ న్యూస్.. కేసుల ఎత్తివేతతో పాటు హాజరులో మినహాయింపు

-

Chat on WhatsApp

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం రెండు కీలక నిర్ణయాలతో భారీ ఊరటనిచ్చింది. గత ప్రభుత్వ హయాంలో నమోదైన పోలీస్ కేసుల ఎత్తివేతతో పాటు, అంధ ఉపాధ్యాయులకు హాజరు నమోదులో మినహాయింపునిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.పోలీస్ కేసుల ఉపసంహరణ2022 ఏప్రిల్ 25న సీపీఎస్ (CPS) రద్దు కోరుతూ విజయవాడలో నిర్వహించిన నిరసన కార్యక్రమాల సందర్భంగా 73 మంది ఉపాధ్యాయులపై నమోదైన కేసులను ఉపసంహరించుకోవాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ అనుమతినిచ్చారు. రెండేళ్లుగా కోర్టు చుట్టూ తిరుగుతున్న ఉపాధ్యాయులకు ఈ నిర్ణయం పెద్ద ఊరటనిచ్చింది.అంధ ఉపాధ్యాయులకు ‘ఫేస్ రికగ్నిషన్’ నుంచి మినహాయింపుమరోవైపు, దృష్టి లోపం ఉన్న ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందికి ముఖ ఆధారిత హాజరు (Face Recognition Attendance) నుంచి ప్రభుత్వం మినహాయింపునిచ్చింది. వీరికి ఇబ్బంది కలగకుండా, వారి హాజరును సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు నేరుగా “లీప్” (LEAP) యాప్‌లో నమోదు చేయాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. ప్రభుత్వ తీసుకున్న ఈ రెండు నిర్ణయాల పట్ల ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

ins-mahendragiri-inducted-into-indian-navy-rajnath-singh

Rajnath Singh | సముద్రంలో భారత్‌కు తిరుగులేదు.. రాజ్‌నాథ్ సింగ్ కీలక ప్రకటన

Rajnath Singh: భారత సముద్ర భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా మరో కీలక అడుగు పడింది. విశాఖపట్నంలోని నావల్ డాక్‌యార్డ్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి భారత నౌకాదళంలో కొత్తగా...
- Advertisement -
Chat on WhatsApp