బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ ఈరోజు తన ఓటు హక్కును వినియోగించారు. ఎల్లారెడ్డి గూడా ప్రాంతంలోని శ్రీకృష్ణ దేవరాయ వెల్ఫేర్ సెంటర్ లో ఏర్పాటు చేసిన బూత్ నెంబర్–290 వద్ద ఆమె ఓటు వేశారు.
పోలింగ్ కేంద్రానికి కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఓటు వేసిన సునీత గోపీనాథ్ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరి ఓటు ఎంతో విలువైనదని, అందరూ తప్పక ఓటు హక్కును వినియోగించాలని పిలుపునిచ్చారు.
ఓటర్లు పెద్ద సంఖ్యలో పాల్గొనడం సంతోషంగా ఉందని ఆమె తెలిపారు. మొత్తం మీద, పోలింగ్ సజావుగా కొనసాగుతుండగా, అభ్యర్థులు ఒక్కొక్కరుగా తమ ఓటు హక్కును వినియోగిస్తున్నారు.
ALSO READ:ఒడిశాలో మానవత్వం మెరుపు – బిడ్డకు పాలిచ్చిన పోలీసమ్మ!
