Saturday, July 18, 2026
Chat on WhatsApp
HomeNationalWayanad | వయనాడ్‌లో మరోసారి విషాదం.. క్షణాల్లో కూలిన కొండ, శిథిలాల్లో కార్మికులు

Wayanad | వయనాడ్‌లో మరోసారి విషాదం.. క్షణాల్లో కూలిన కొండ, శిథిలాల్లో కార్మికులు

-

Chat on WhatsApp

కేరళలోని వయనాడ్(Wayanad) జిల్లాలో మరోసారి కొండచరియలు విరిగిపడిన ఘటన కలకలం సృష్టించింది. గత కొంతకాలంగా ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ ప్రాంతంలో తాజాగా భారీ వర్షాల కారణంగా మరో ప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం రాత్రి నుంచి కురుస్తున్న నిరంతర వర్షాల ప్రభావంతో అనక్కంపొయిల్‌-కల్లాడి సొరంగం నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతంలో భూమి ఒక్కసారిగా కుంగిపోయింది.

మంగళవారం ఉదయం కల్లాడి ప్రాంతంలోని మీనాక్షి వంతెన సమీపంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాద సమయంలో అక్కడ విధుల్లో ఉన్న పలువురు నిర్మాణ కార్మికులు మట్టి, రాళ్ల శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం. విషయం తెలిసిన వెంటనే అధికారులు స్పందించి సహాయక చర్యలను వేగవంతం చేశారు.

ప్రమాద స్థలానికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు ప్రారంభించి కొంతమంది కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అయితే మరికొందరు కార్మికులు ఇంకా శిథిలాల కిందే ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. చిక్కుకున్న వారిని గుర్తించి రక్షించేందుకు సహాయక బృందాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.

భారీ వర్షాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల మధ్య సహాయక బృందాలు అప్రమత్తంగా పనిచేస్తున్నాయి. వయనాడ్ ప్రాంతం గతంలోనూ కొండచరియల ప్రమాదాలతో తీవ్ర నష్టాలను ఎదుర్కొన్న నేపథ్యంలో తాజా ఘటనపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. చిక్కుకున్న వారిని వీలైనంత త్వరగా రక్షించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నారు.

కేరళలోని వయనాడ్ జిల్లాలో మరోసారి కొండచరియలు విరిగిపడిన దృశ్యాలు

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Nara Lokesh meeting Pawan Kalyan during his recovery after shoulder surgery

Nara Lokesh | పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన నారా లోకేష్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష

Nara Lokesh: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను మంత్రి నారా లోకేష్ మర్యాదపూర్వకంగా కలిసి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఇటీవల ముంబైలో కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని...
- Advertisement -
Chat on WhatsApp