దేవస్థానం.. యాత్రా స్థలం.! ఆధ్యాత్మిక నిలయం.! సనాతన ధర్మం.!
అసలు దేవస్థానం అంటే ఏంటి.?
దేయాలయాలు కొందరి దృష్టిలో కేవలం ‘పర్యాటక కేంద్రాలుగా’ మాత్రమే మారిపోతున్నాయి.?
దేవాలయాలకు దైవ దర్శనం కోసం వెళ్ళాలి తప్ప, అక్కడ సెల్ఫీల కోసం ఎగబడ్డమేంటి.? ‘రీల్స్’ పేరుతో, పబ్లిసిటీ స్టంట్లు చేయడమేంటి.?
ఎప్పుడైతే, దేవాలయాల చుట్టూ, ‘ఆధ్మాత్మిక పర్యాటకం’ అనే ఆలోచన ప్రభుత్వాలు చేయడం మొదలు పెట్టాయో, ఆ తర్వాతే పైన పేర్కొన్న ‘దరిద్రాలన్నీ’ ఎక్కువైపోయాయి.
స్టార్ హోటళ్ళను తలపించేలా, ‘విశ్రాంతి గదులు.. సూట్ రూమ్స్..’ ఏర్పాటు చేయడం ద్వారా, ‘పర్యాటకాన్ని’ ప్రోత్సహిస్తున్నారు తప్ప, భక్తుల మనోభావాలకు విలువ లేకుండా పోతోంది.
ఈ క్రమంలో భక్తులు సైతం, ఆయా ‘సౌకర్యాల’ పట్ల సహజంగానే ఆకర్షితులవుతారు. ‘సౌకర్యాలు సరిగ్గా వుంటేనే, దైవ దర్శనం’ అనే స్థాయికి దిగజారిపోయింది పరిస్థితి.
సనాతన హిందూ ధర్మం..
అసలు హిందూ ధర్మం ఏంటి.? సనాతన ధర్మం తాలూకు ప్రాముఖ్యత ఏంటి.? ఇవన్నీ అసలు చర్చనీయాంశాలు కాకుండా పోతున్నాయి.
సరిగ్గా, ఈ పరిస్థితుల్లోనే జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ‘సనాతన ధర్మ పరిరక్షణ’కు నడుం బిగించారు. లడ్డూ అంటే స్వీట్ కాదనీ, దేవాలయం అంటే.. కేవలం పర్యాటక కేంద్రం కాదని నినదించారు.
సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఆవశ్యకత గురించి ఎలుగెత్తి చాటారు జనసేనాని పవన్ కళ్యాణ్. ఇప్పుడీ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది.
వైసీపీ హయాంలో తిరుమలపై అప్పటి పాలకుల నిర్లక్ష్యం, వెంకన్న లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేయడం.. వంటి అంశాలపై ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇంకోసారి చర్చ జరుగుతోంది.
ఇంగ్లీషు, తెలుగు సహా వివిధ భాషల్లో, దేవాలయాల సంరక్షణ.. సనాతన దర్మ పరిరక్షణ.. తిరుమల పవిత్రత.. ఇలా పలు అంశాలపై జనసేన పార్టీ, ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వరుస ట్వీట్లేస్తున్నారు.
ఆ ట్వీట్ల సారాంశం యధాతథంగా…
ప్రపంచ హిందూ సమాజానికి తిరుమల తిరుపతి దేవస్థానం కేవలం ఒక యాత్రా స్థలం మాత్రమే కాదు; అది ఒక పవిత్రమైన ఆధ్యాత్మిక నిలయం.
తిరుపతి లడ్డూ కేవలం ఒక స్వీట్ కాదు, హిందువుల భావోద్వేగాల ప్రతీక. దాన్ని ప్రసాదంగా కుటుంబ సభ్యులు, స్నేహితులందరితో పంచుకుంటాము, ఎందుకంటే అది మన విశ్వాసం, ఆధ్యాత్మిక భక్తికి ప్రతీక.
సగటున ప్రతి సంవత్సరం సుమారు 2.5 కోట్లు భక్తులు తిరుమలకి విచ్చేస్తారు.
ఇలాంటి సమయంలో సనాతన ధర్మాన్ని, దాని సంప్రదాయాలను అవహేళన చేయడం లేదా అవమానించడం కేవలం బాధ కలిగించే విషయం మాత్రమే కాదు, అది ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది భక్తుల విశ్వాసాన్ని, భక్తి భావాలను దెబ్బతీస్తుంది.
సెక్యులరిజం ఎల్లప్పుడూ రెండు వైపులా ఉండాలి. మన మత విశ్వాసాల రక్షణ, గౌరవం విషయంలో ఎప్పటికీ రాజీ పడకూడదు.
మన సనాతన ధర్మం ప్రపంచంలోని అత్యంత పురాతనమైన, నిరంతరంగా అభివృద్ధి చెందుతున్న నాగరికతలలో ఒకటి. కాబట్టి, అందరి మద్దతుతో “సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు”ను ఏర్పాటు చేసే సమయం ఆసన్నమైంది.
హిందూ దేవాలయాలంటే, అవి ఆధ్మాత్మిక కేంద్రాలు మాత్రమే.! ‘పర్యవేక్షణ’ పేరుతో, ప్రభుత్వాలు పెత్తనం చేయడాన్ని అస్సలు సమర్థించకూడదు.
రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రాలుగా టీటీడీ లాంటివి మారడం అత్యంత హేయం. ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్, ఈ విషయాలపై ప్రభుత్వంలోనే మార్పు తీసుకురావాల్సిన అవసరం వుంది.
