దేశ రాజధాని ఢిల్లీలో ఎర్రకోట సమీపంలో చోటుచేసుకున్న పేలుడు ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఆయన తక్షణమే స్పందించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఉన్నతాధికారులతో మాట్లాడారు. సంఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకుని, ప్రస్తుతం కొనసాగుతున్న రక్షణ, దర్యాప్తు చర్యలపై సమీక్ష నిర్వహించారు.
పేలుడులో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రధాని మోదీ గాఢ సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఈ ఘటనకు కారణమైన అంశాలను త్వరగా బయటపెట్టాలని, ప్రజల భద్రతకు సంబంధించిన చర్యలను మరింత బలోపేతం చేయాలని అధికారులను ఆదేశించారు.

ఇక, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఘటనాస్థలిని స్వయంగా సందర్శించి పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారు. తరువాత లోక్‌నాయక్ ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించి, వారికి అందుతున్న వైద్యసేవలపై సమాచారం తీసుకున్నారు.
దాడి వెనుక ఉన్న మూలాలను గుర్తించి నిందితులను కఠినంగా శిక్షించేందుకు ఎన్‌ఐఏ, ఫోరెన్సిక్ బృందాలు ఇప్పటికే రంగంలోకి దిగాయని ఆయన తెలిపారు.
ALSO READ:నెమ్మదిగా సాగుతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్
