Saturday, July 18, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshకోల్‌కతా వైద్యురాలి హత్యలో ఆసుపత్రి సిబ్బందిపై అనుమానాలు

కోల్‌కతా వైద్యురాలి హత్యలో ఆసుపత్రి సిబ్బందిపై అనుమానాలు

-

Chat on WhatsApp

కోల్‌కతా వైద్యురాలిపై అత్యాచారం, హత్య కేసులో ఇప్పుడు వేళ్లని ఆర్‌జీ కర్ ఆసుపత్రి వైపే చూపిస్తున్నాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన ఆడియో క్లిప్ ఒకటి అనుమానాలను మరింత బలపరుస్తోంది. వైద్యురాలు హత్యకు గురైన తర్వాత ఈ నెల 9న బాధిత వైద్యురాలి తల్లిదండ్రులకు ఆసుపత్రి సిబ్బంది ఫోన్ చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఆడియో క్లిప్‌లోని వివరాలు బాధిత తల్లిదండ్రులు తొలుత మీడియాకు చెప్పిన వివరాలతో సరిపోలుతున్నాయి. ఓ మహిళ తమకు ఫోన్ చేసి కుమార్తె విషయం చెప్పినట్టు వారు పేర్కొన్నారు.

ఆసుపత్రిలోని చాతీ విభాగంలో వైద్యురాలు హత్యాచారానికి గురైంది. అప్పుడా విభాగానికి అరుణవ దత్తా చౌదరి ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. ఈ నెల 14న మీడియాతో మాట్లాడుతూ బాధిత వైద్యురాలి తల్లిదండ్రులకు నాన్ మెడికల్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ సుచిత్ర సర్కార్ ఫోన్ కాల్స్ చేసినట్టు తెలిపారు. సీబీఐ ఆమెను ప్రశ్నించింది. అయితే, ఘటన జరిగిన తర్వాతి నుంచి  ఇప్పటి వరకు ఆమె మీడియా ముందుకు రాలేదు.

ఆ కాల్‌లో ఆ మహిళ (సుచిత్ర) వైద్యురాలి తండ్రితో మాట్లాడుతూ.. ‘‘మీ అమ్మాయి తీవ్ర అస్వస్థతో బాధపడుతోంది. ఆసుపత్రిలో చేర్చాం. త్వరగా రండి’’ అని పేర్కొన్నారు. ఏమైందని ఆయన అడిగితే ‘‘ఆమెకు బాగాలేదు. ఆమెకు ఏమైందన్నది వైద్యులు మాత్రమే చెప్పగలరు. మీ నంబరు తెలుసుకుని ఫోన్ చేశాం’’ అని చెప్పారు. 

మరో ఆడియో క్లిప్‌లో ఆమె మాట్లాడుతూ.. ‘‘ఆమెకు సీరియస్‌గా ఉంది. ఎమర్జెన్సీ వార్డులో జాయిన్ చేశాం. ఏమైందో నేను చెప్పలేను. వైద్యులు మాత్రమే చెప్పగలరు.. త్వరగా రండి’’ అని పేర్కొన్నారు.  ‘ఇంతకీ మీరెవరు?’ అని అడిగితే ‘నేను అసిస్టెంట్ సూపరింటెండెంట్‌ను. నేను డాక్టర్‌ను కాదు. 

మూడోసారి ఫోన్ చేస్తూ.. ‘‘ఆమె ఆత్మహత్య చేసుకుంది. చనిపోయినట్టుగా ఉంది. పోలీసులు వచ్చారు. మేమంతా ఇక్కడే ఉన్నాం. వీలైనంత త్వరగా రండి’’ అని పేర్కొన్నారు. ఆయన తన ఫోన్ స్పీకర్‌ను ఆన్ చేయడంతో ఆ విషయాన్ని బాధితురాలి తల్లి కూడా ఉంది. 

పోస్టుమార్టం రిపోర్టు మాత్రం ఆమె తెల్లవారుజామున 3 నుంచి 5 మధ్య జూనియర్ వైద్యురాలు చనిపోయినట్టు నిర్ధారణ అయింది. ఆసుపత్రి వైద్యులు మాత్రం మృతదేహాన్ని 9 గంటలకు సెమినార్ హాల్‌లో చూసినట్టు చెప్పారు. ఆసుపత్రి నుంచి 10.53 గంటలకు తొలి ఫోన్ కాల్ వచ్చినట్టు చెప్పారు. ఆ తర్వాత రెండు కాల్స్ వచ్చినట్టు తెలిపారు.   

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Indus Waters Treaty arbitration dispute between India and Pakistan

Indus Waters Treaty | భారత్ ఇచ్చిన షాక్‌కు పాక్ విలవిల, సింధు వివాదం.. భారత్...

Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందానికి సంబంధించిన అంతర్జాతీయ మధ్యవర్తిత్వ వివాదంలో పాకిస్థాన్‌కు ఆర్థిక భారం పెరుగుతోంది. భారత్ ఈ ప్రక్రియకు దూరంగా ఉండటంతో, విచారణ నిర్వహణకు సంబంధించిన మొత్తం ఖర్చును ప్రస్తుతం...
- Advertisement -
Chat on WhatsApp