వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కరెంటు చార్జీల పెంపుపై చీరాల నియోజకవర్గ పరిధిలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ రోజు 27/12/2024న కొత్తపేట పంచాయతీ, VRS & YRN కాలేజీ రోడ్డు లో గల కరెంట్ ఆఫీస్ వద్ద కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి చీరాల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి కరణం వెంకటేష్ బాబు నాయకత్వం వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రజలపై పడుతున్న ఆర్థిక భారాన్ని అర్థం చేసుకోవాలని, కరెంటు చార్జీల పెంపును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ నిరసనలో టీ బాపట్ల జిల్లా వైసీపీ అనుబంధ విభాగాల అధ్యక్షులు, చీరాల నియోజకవర్గంలో వివిధ హోదాలో ఉన్న నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా పాల్గొన్నారు. నిరసన కార్యక్రమం ప్రశాంతంగా కొనసాగగా, ప్రజల నుంచి విశేషమైన మద్దతు లభించింది.
నిరసన అనంతరం, నాయకులు కరెంటు చార్జీల పెంపుపై ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయాల గురించి చర్చించారు. ప్రజల సంక్షేమం కోసం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తుందని నాయకులు హామీ ఇచ్చారు.