Tuesday, July 21, 2026
Chat on WhatsApp
HomeTechnology NewsYouTube smart TV | యూట్యూబ్ కొత్త ప్లాన్.. టీవీల్లో మరింత ఎక్కువ non-skippable ads?

YouTube smart TV | యూట్యూబ్ కొత్త ప్లాన్.. టీవీల్లో మరింత ఎక్కువ non-skippable ads?

-

Chat on WhatsApp

YouTube smart TV: స్మార్ట్ టీవీలో యూట్యూబ్ చూస్తున్న వారికి కొత్త షాక్ ఎదురవుతోంది. ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ YouTube, టీవీ యూజర్లకు చూపించే ప్రకటనల వ్యవధిని మరింత పెంచే దిశగా అడుగులు వేస్తోందనే వార్తలు చర్చనీయాంశంగా మారాయి.

ఇప్పటికే కొంతమంది వినియోగదారులకు 90 సెకన్ల వరకు స్కిప్ చేయలేని ads కనిపిస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్టులు వెలువడుతున్నాయి. అయితే, దీనిపై YouTube నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

ఇప్పటివరకు connected TVs లేదా స్మార్ట్ టీవీ (smart TVs) లో సాధారణంగా 30 సెకన్ల వరకు non-skippable ads మాత్రమే కనిపించేవి. కానీ తాజాగా కొన్ని నివేదికల ప్రకారం, దీర్ఘకాలిక వీడియోల మధ్య 90-second ad blocks పరీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా టీవీల్లో వీడియోలు చూస్తున్న ఫ్రీ యూజర్లకు ఈ మార్పు ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉంది.

ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశ్యం ప్రకటనల ద్వారా ఆదాయం పెంచుకోవడం అని టెక్ వర్గాలు భావిస్తున్నాయి. ఒకవైపు పెద్ద బ్రాండ్ల ప్రకటనదారులను ఆకర్షించడం, మరోవైపు ప్రకటనలు లేకుండా వీడియోలు చూడాలనుకునే యూజర్లను యు ట్యూబ్ ప్రీమియం (YouTube Premium) వైపు మళ్లించడం కూడా ఈ వ్యూహంలో భాగమై ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఇక ఈ మార్పు కేవలం smart TVsకే పరిమితమా? లేక భవిష్యత్తులో mobile, desktop యూజర్లకూ విస్తరిస్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రకటనల సంఖ్య, వ్యవధి పెరుగుతుండటంతో free usersలో అసంతృప్తి పెరుగుతోంది.

అదే సమయంలో creatorsకి revenue అందించడంలో ads కీలకమని YouTube వాదిస్తోంది. ప్రస్తుతం ఈ మార్పు టెస్ట్ దశలో ఉన్నట్లు కనిపిస్తున్నా, పూర్తి స్థాయిలో అమలైతే viewing experienceపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

YouTube on TVs కోసం 30-second non-skippable ads(నాన్ స్కిప్ప బిల్ యాడ్స్) అధికారికంగా అందుబాటులో ఉన్నాయని, 90-second ads విషయంపై మాత్రం యూజర్ రిపోర్ట్స్ ఆధారంగా చర్చ నడుస్తోందని టెక్ సైట్లు పేర్కొన్నాయి.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

JP Nadda visiting injured protesters at RML Hospital in Delhi

JP Nadda | నీట్ వివాదంలో కీలక పరిణామం.. గాయపడిన వారిని పరామర్శించిన జేపీ...

నీట్-యూజీ 2026 పరీక్షలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో దేశ రాజధాని ఢిల్లీలో నిరసనలు హోరెత్తాయి. సోమవారం జరిగిన నిరసనల్లో గాయపడిన వారిని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా(JP Nadda) మంగళవారం పరామర్శించారు....
- Advertisement -
Chat on WhatsApp