WhatsApp: డ్రైవింగ్ చేస్తున్న వినియోగదారులకు వాట్సాప్ ఒక కొత్త సదుపాయాన్ని తీసుకొచ్చింది. కార్ డ్రైవర్లు ఫోన్‌ను తాకకుండా సురక్షితంగా కమ్యూనికేషన్ చేసుకునేలా కొత్త కార్ ఇంటర్ఫేస్ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఈ ఫీచర్ ముఖ్యంగా Apple CarPlay వినియోగదారులకు మరింత సౌకర్యంగా మారనుంది. తాజా iOS అప్డేట్ ద్వారా వాట్సాప్ ఇప్పుడు కారు ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌లో పూర్తి స్థాయి యాప్‌లా పనిచేస్తోంది.
ఇప్పటివరకు కార్ ప్లేలో కేవలం మెసేజ్ నోటిఫికేషన్లు మాత్రమే కనిపించేవి. కానీ ఇప్పుడు కొత్త అప్డేట్తో కాల్స్‌ను స్వీకరించడం, రిజెక్ట్ చేయడం, అలాగే చాట్ హిస్టరీ చూడడం వంటి ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. ప్రత్యేకంగా రూపొందించిన కాల్స్ ట్యాబ్ ద్వారా డ్రైవింగ్ సమయంలోనే సులభంగా కాల్ మేనేజ్మెంట్ చేయవచ్చు.
ఇంకా ముఖ్యంగా వాయిస్ డిటెక్షన్ ఫీచర్ అందుబాటులోకి రావడంతో డ్రైవర్ టైప్ చేయాల్సిన అవసరం లేకుండా మాటల ద్వారా మెసేజ్‌లు పంపవచ్చు. ఇది పూర్తిగా హ్యాండ్స్-ఫ్రీ అనుభవాన్ని అందిస్తుంది.
గతంలో సిరి వంటి వాయిస్ అసిస్టెంట్‌పై ఎక్కువ ఆధారపడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు యాప్ ఇంటర్ఫేస్లోనే అన్ని ఆప్షన్లు ఉండటంతో మరింత సులభంగా ఉపయోగించుకోవచ్చు.
ఐఫోన్‌ను బ్లూటూత్ లేదా కేబుల్ ద్వారా కార్ సిస్టమ్‌కు కనెక్ట్ చేసిన వెంటనే ఈ కొత్త వాట్సాప్ ఇంటర్ఫేస్ ఆటోమేటిక్‌గా యాక్టివేట్ అవుతుంది. డ్రైవింగ్ సమయంలో దృష్టి మరలకుండా, సురక్షితంగా కమ్యూనికేషన్ కొనసాగించేందుకు ఈ ఫీచర్‌ను రూపొందించారు.








