Sunday, July 19, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshవిశాఖ స్టీల్ ప్లాంట్ బాధితులకు అండగా ఉంటామని డిప్యూటీ సీఎం హామీ

విశాఖ స్టీల్ ప్లాంట్ బాధితులకు అండగా ఉంటామని డిప్యూటీ సీఎం హామీ

-

Chat on WhatsApp

Visakhapatnam Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఇటీవల చోటుచేసుకున్న ఘోర ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Deputy Chief Minister Pawan Kalyan) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మెటల్ లిక్విడ్ లాడిల్ పేలుడు ఘటనలో ఎనిమిది మంది కార్మికుల మరణం తీవ్ర ఆవేదన కలిగించిందని చెప్పారు.  ప్రమాదంలో గాయపడిన బాధితులను ఆస్పత్రిలో పరామర్శించిన అనంతరం ఆయన స్టీల్ ప్లాంట్‌కు వెళ్లి ఘటనాస్థలాన్ని పరిశీలించారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన పవన్ కల్యాణ్, ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ కోసం ముగ్గురు సభ్యులతో ప్రత్యేక కమిటీని నియమించినట్లు వెల్లడించారు. ఈ కమిటీ త్వరలోనే నివేదిక సమర్పిస్తుందని తెలిపారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న క్షతగాత్రుల వైద్య ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు.

ప్రమాదానికి ముందు భద్రతా ప్రమాణాలు సక్రమంగా అమలయ్యాయా లేదా అనే అంశంపై దర్యాప్తు జరుగుతోందన్నారు. సేఫ్టీ ఆడిట్లు ఎంతవరకు నిర్వహించారో, కార్మికులు సూచించిన లోపాలపై యాజమాన్యం స్పందించిందో లేదో పరిశీలిస్తున్నామని తెలిపారు. భద్రతా ఉల్లంఘనలపై పలుమార్లు ఫిర్యాదులు చేసినా స్పందన లేదని కొందరు కార్మికులు చెబుతున్నారని పేర్కొన్నారు.

త్వరలోనే స్టీల్ ప్లాంట్ కార్మికులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి వారి సమస్యలు, భద్రతా అంశాలపై చర్చిస్తామని పవన్ తెలిపారు. అలాగే ప్రతి కార్మికుడు పదవీ విరమణ వరకు స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్‌లో కొనసాగేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు.

ప్రమాదంలో మరణించిన రెగ్యులర్ ఉద్యోగుల కుటుంబాలకు రూ.1.72 కోట్ల చొప్పున, కాంట్రాక్ట్ కార్మికుడి కుటుంబానికి రూ.45.75 లక్షలు, అదనంగా ప్రతి మృతుడి కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థిక సాయం అందజేస్తామని ఉపముఖ్యమంత్రి ప్రకటించారు.

Image
- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Nara Lokesh meeting Pawan Kalyan during his recovery after shoulder surgery

Nara Lokesh | పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన నారా లోకేష్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష

Nara Lokesh: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను మంత్రి నారా లోకేష్ మర్యాదపూర్వకంగా కలిసి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఇటీవల ముంబైలో కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని...
- Advertisement -
Chat on WhatsApp