Vijayawada Maoist Arrests: ఏకే-47 సహా భారీ ఆయుధాలు స్వాధీనం 

AK-47 and explosives seized by AP police during Maoist arrests in Vijayawada AK-47 and explosives seized by AP police during Maoist arrests in Vijayawada

విజయవాడలో మావోల అరెస్టుపై సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.పెనమలూరు ప్రాంతంలో కూలీల పేరుతో ఓ భవనాన్ని అద్దెకు తీసుకుని మావోలు షెల్టర్ జోన్‌గా మార్చుకున్నట్లు విచారణలో బయటపడింది. అక్కడ నుంచే పలు కార్యక్రమాలు నిర్వహించినట్లు సూచనలు లభించాయి.

also read:సింగపూర్, టోక్యోతో పోటీ పడుతున్న హైదరాబాద్:సీఎం రేవంత్ రెడ్డి

ఆక్టోపస్ ప్రత్యేక బృందం ఈ రోజు నిర్వహించిన సమన్వయ ఆపరేషన్‌లో నగరంలోని పలు ప్రాంతాలు టార్గెట్ చేయగా, మొత్తం 31 మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు. ఆటోనగర్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన డంప్‌ నుండి ఏకే-47 రైఫిల్‌తో పాటు భారీగా డిటోనేటర్లు, గోలీలు, పేలుడు పదార్థాలు స్వాధీనం అయ్యాయి.

మావోయిస్టులు నగరంలో కార్యకలాపాలను విస్తరించే యత్నంలో ఉన్నారన్న అనుమానాల నేపథ్యంలో పోలీసులు మరిన్ని ప్రాంతాల్లో అన్వేషణ కొనసాగిస్తున్నారు. ఈ ఆపరేషన్‌ను ఏపీ పోలీస్ విభాగం అత్యంత కీలకంగా పరిగణిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *