Tuesday, July 21, 2026
Chat on WhatsApp
HomeENTERTAINMENTVarun Tej | ‘బరి’తో బరిలోకి వరుణ్‌ తేజ్.. క్లాప్‌ కొట్టిన పవన్‌ కల్యాణ్‌

Varun Tej | ‘బరి’తో బరిలోకి వరుణ్‌ తేజ్.. క్లాప్‌ కొట్టిన పవన్‌ కల్యాణ్‌

-

Chat on WhatsApp

Varun Tej: మెగా హీరో వరుణ్‌ తేజ్ కొత్త చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ‘బరి’(Bari) పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు యదు వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై నిహారిక కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నేడు ఈ సినిమా పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభమైంది.

ఏపీ డిప్యూటీ సీఎం, ప్రముఖ నటుడు పవన్‌ కల్యాణ్‌ ఈ చిత్రానికి క్లాప్‌ కొట్టి శుభారంభం చేయడంతో ఈ మూవీపై మరింత ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ఈ ప్రారంభోత్సవానికి సంబంధించిన విజువల్స్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

‘బరి’ చిత్రం వాలీబాల్‌(Volleyball) కథా నేపథ్యంతో రూపొందనుండటం ప్రత్యేకతగా మారింది. అయితే ఇది కేవలం స్పోర్ట్స్‌ డ్రామా మాత్రమే కాకుండా, బలమైన భావోద్వేగాలతో కూడిన కథ అని దర్శకుడు యదు వంశీ తెలిపారు. స్పోర్ట్స్‌తో పాటు ఎమోషన్స్‌కి కూడా సమాన ప్రాధాన్యం ఇచ్చినట్లు ఆయన చెప్పారు.

దీంతో ఈ సినిమా క్రీడా నేపథ్యంలో సాగే ఓ ఇంటెన్స్‌ ఎమోషనల్‌ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

ఈ సందర్భంగా వరుణ్‌ తేజ్‌ మాట్లాడుతూ, నిహారిక మంచి సినిమాలను నిర్మిస్తూ కొత్త ప్రతిభకు అవకాశాలు కల్పిస్తోందని అన్నారు. టాలెంట్‌కు ప్రాధాన్యం ఇస్తున్న తన సోదరిని చూసి గర్వంగా ఉందని చెప్పారు. సరదాగా మాట్లాడుతూ, “రెమ్యునరేషన్‌లో కొంచెం ఆల్‌రెడీ తీసేసుకున్నా” అని నవ్వులు పూయించారు.


ఇక పాత్ర కోసం తాను గత 7 నెలలుగా వాలీబాల్‌ ప్రాక్టీస్‌ చేస్తున్నానని వెల్లడించారు. ప్రీ ప్రొడక్షన్‌ పనులన్నీ పూర్తయ్యాయని, అందుకే 8 నెలల్లో షూటింగ్‌ పూర్తి చేయగలమనే నమ్మకం ఉందన్నారు.

నిర్మాత నిహారిక మాట్లాడుతూ, కథపై పూర్తి నమ్మకం ఉందని, అందుకే ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్‌ చేస్తున్నామని చెప్పారు. త్వరలోనే నటీనటులు, సాంకేతిక నిపుణులు, విడుదల తేదీకి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Kanishka Narayan and Lisa Nandy in the new UK Cabinet

Britain AI Minister | యూకే తొలి AI మంత్రిగా భారతీయుడు.. చరిత్ర సృష్టించిన కనిష్క

Britain AI Minister: కొత్త కేబినెట్‌ను ప్రకటించిన బ్రిటన్ ప్రభుత్వం, భారతీయ మూలాలున్న ఇద్దరు నేతలకు కీలక మంత్రిత్వ శాఖలను కేటాయించింది. కొత్త ప్రధానమంత్రి ఆండీ బర్న్‌హామ్ తన కేబినెట్‌లో కనిష్క నారాయణ్‌, లీసా నాండీకి...
- Advertisement -
Chat on WhatsApp