HomeInterNationalDonald Trump | హర్మూజ్ ఉద్రిక్తతల మధ్య ట్రంప్ సంచలన ప్రకటన

Donald Trump | హర్మూజ్ ఉద్రిక్తతల మధ్య ట్రంప్ సంచలన ప్రకటన

-

Chat on WhatsApp

Donald Trump: అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల మధ్య శాంతి చర్చలు కీలక దశకు చేరుకున్నాయి. ఇరాన్‌తో జరుగుతున్న దౌత్య చర్చల్లో గొప్ప పురోగతి కనిపిస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. హర్మూజ్ జలసంధిలో చిక్కుకుపోయిన వాణిజ్య నౌకలను రక్షించేందుకు చేపట్టిన ‘ప్రాజెక్ట్ ఫ్రీడమ్’ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

పాకిస్థాన్ సహా పలు దేశాల విజ్ఞప్తులు, టెహ్రాన్‌తో జరుగుతున్న చర్చల్లో పురోగతిని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

అయితే హర్మూజ్ జలసంధి మూసివేత కొనసాగితే ఇరాన్‌పై తీవ్ర చర్యలు తప్పవని ట్రంప్ హెచ్చరించారు. చైనా పర్యటనకు వెళ్లేలోపే ఇరాన్‌తో ఒప్పందం కుదిరే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

మరోవైపు, ఇరాన్‌పై ఇజ్రాయెల్‌తో కలిసి చేపట్టిన ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ విజయవంతంగా పూర్తైందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో వెల్లడించారు. ఈ చర్యలు రక్షణాత్మకమైనవేనని, ఇప్పుడు శాంతియుత పరిష్కారానికే ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు.

ఇక చైనా కూడా ఈ పరిణామాలపై స్పందించింది. హర్మూజ్ జలసంధిని త్వరగా తెరవాలని ఇరాన్‌ను కోరిన చైనా, గల్ఫ్ మరియు పశ్చిమాసియా దేశాలు తమ భవిష్యత్తును స్వయంగా నిర్ణయించుకోవాలని అభిప్రాయపడింది.

ఇదే సమయంలో ఇరాన్‌లోని టెహ్రాన్ ప్రావిన్స్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 8 మంది మరణించగా, 40 మంది గాయపడ్డారు. మరోవైపు నోబెల్ గ్రహీత నర్గిస్ మహమ్మదీ ఆరోగ్య పరిస్థితిపై కూడా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Lionel Messi | మెస్సీ ఇంట తీవ్ర విషాదం.. తండ్రి జార్జ్ మెస్సీ కన్నుమూత

Lionel Messi: ఫుట్‌బాల్ ప్రపంచాన్ని విషాదంలో ముంచెత్తే వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాలర్ లియోనెల్ మెస్సీ తండ్రి, ఆయన కెరీర్‌కు బలమైన అండగా నిలిచిన జార్జ్ మెస్సీ (68)...
- Advertisement -
Chat on WhatsApp