Wednesday, July 15, 2026
Chat on WhatsApp
HomeAndhra PradeshForbes 30 Under 30 Asia 2026 | ఫోర్బ్స్ జాబితాలో ఇద్దరు తెలుగు యువతకు...

Forbes 30 Under 30 Asia 2026 | ఫోర్బ్స్ జాబితాలో ఇద్దరు తెలుగు యువతకు అరుదైన గౌరవం

-

Chat on WhatsApp

తెలుగు యువ పారిశ్రామికవేత్తల ప్రతిభకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ప్రతిష్ఠాత్మక ఫోర్బ్స్ 30 అండర్ 30 ఆసియా 2026(Forbes 30 Under 30 Asia 2026) జాబితాలో ఇద్దరు తెలుగు యువకులు స్థానం సంపాదించి ప్రపంచ దృష్టిని ఆకర్షించారు.. ఆర్థిక అక్షరాస్యతను ప్రోత్సహించే స్టార్టప్ Geni5 వ్యవస్థాపకుడు శివ గణేష్ గడ్డం ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు.

పిల్లలు, యువతకు పెట్టుబడులు, పొదుపు, ఆర్థిక ప్రణాళిక వంటి అంశాలను సులభంగా అర్థమయ్యే విధంగా కామిక్స్, కథనాలు, డిజిటల్ కంటెంట్ రూపంలో అందిస్తూ ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు. చిన్న వయసులోనే ఆర్థిక అవగాహన పెంపొందించాలనే లక్ష్యంతో చేపట్టిన కార్యక్రమాలు విశేష ఆదరణ పొందుతున్నాయి.

అదేవిధంగా, Yedodwaja Foundation వ్యవస్థాపకుడు మధులాష్ బాబు క్రోవ్విడి కూడా ఫోర్బ్స్ జాబితాలో స్థానం సంపాదించారు. విద్య, సామాజిక అభివృద్ధి, యువత సాధికారత రంగాల్లో ఆయన చేపట్టిన కార్యక్రమాలు సమాజంపై సానుకూల ప్రభావం చూపుతున్నాయని ఫోర్బ్స్ పేర్కొంది.

ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు గుర్తింపును తెచ్చిపెట్టాయి. ప్రతి ఏడాది ఫోర్బ్స్ సంస్థ 30 ఏళ్లలోపు వయస్సు కలిగిన ప్రతిభావంతులైన యువ నాయకులు, వ్యాపారవేత్తలు, సామాజిక కార్యకర్తలు, సృజనాత్మక రంగాల వ్యక్తులను ఎంపిక చేసి “30 Under 30” జాబితాను విడుదల చేస్తుంది. ఈ జాబితాలో స్థానం సంపాదించడం ప్రపంచవ్యాప్తంగా ఒక అరుదైన గౌరవంగా భావిస్తారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

- Advertisement -
Chat on WhatsApp