Wednesday, March 4, 2026
No menu items!
Google search engine
HomeTelanganaTiger Census Telangana: 994 వన్యప్రాణుల ఆనవాళ్లు నమోదు

Tiger Census Telangana: 994 వన్యప్రాణుల ఆనవాళ్లు నమోదు

- Advertisement -
Google search engine

Tiger Census Telangana: తెలంగాణ అటవీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పులుల గణన సర్వే విజయవంతంగా పూర్తైంది. రాష్ట్రవ్యాప్తంగా జనవరి 19 నుంచి 25 వరకు ఆరు రోజుల పాటు శాస్త్రీయ పద్ధతుల్లో ఈ సర్వే నిర్వహించినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. సమ్మక్క–సారలమ్మ జాతర నేపథ్యంలో ములుగు జిల్లా మినహా మిగతా 32 జిల్లాల్లో సర్వే పూర్తైనట్లు వెల్లడించారు.

ప్రతి రోజు రెండు కిలోమీటర్ల ట్రాన్సెక్ట్ సర్వే ద్వారా అటవీ వృక్షజాలం, ఆహార జంతువుల సాంద్రతపై అటవీ శాఖ అంచనా వేసింది. క్షేత్ర స్థాయిలో సేకరించిన వివరాలను M-STRIPES యాప్‌లో నమోదు చేసి, వాటిని వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా రిమోట్ సర్వర్‌కు అప్‌లోడ్ చేసినట్లు అధికారులు తెలిపారు.

ప్రాథమిక గణాంకాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా పులులు, ఇతర మాంసాహార జంతువుల ఉనికికి సంబంధించిన 994 ఆధారాలు లభించాయి. అలాగే 552 పెద్ద శాకాహార జంతువుల ఆనవాళ్లు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఇతర వన్యప్రాణులకు సంబంధించిన ఆధారాలు కూడా గణనీయంగా లభ్యమైనట్లు వెల్లడించారు.

ఈ సర్వేలో 4,512 మంది అటవీ శాఖ సిబ్బందితో పాటు దేశ నలుమూలల నుంచి వచ్చిన 1,677 మంది వాలంటీర్లు పాల్గొనడం విశేషంగా నిలిచింది.

ALSO READ:Indian Fishermen | విశాఖకు చెందిన 9 మంది మత్స్యకారులకు విముక్తి

- Advertisement -
Google search engine
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular