Monday, July 6, 2026
Chat on WhatsApp
HomeTelanganaRythu Bharosa | వానాకాలం సీజన్‌లో రైతులకు ఊరట.. డైరెక్ట్‌గా ఖాతాల్లోకి నిధులు జమ

Rythu Bharosa | వానాకాలం సీజన్‌లో రైతులకు ఊరట.. డైరెక్ట్‌గా ఖాతాల్లోకి నిధులు జమ

-

Chat on WhatsApp

Rythu Bharosa: ఖరీఫ్ సీజన్ ప్రారంభం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమం వేగంగా కొనసాగుతోంది. రైతులకు అవసరమైన ఆర్థిక భరోసా అందించేందుకు ప్రభుత్వం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) విధానంలో నిధులను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోంది. తాజాగా ఈ విడతలో 7 ఎకరాల లోపు సాగు భూమి ఉన్న అర్హులైన రైతులకు సాయం విడుదల చేశారు. మొత్తం 92,729 మంది రైతుల ఖాతాల్లో రూ.354.96 కోట్లు జమ చేసినట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు.

విత్తనాలు, ఎరువుల కొనుగోళ్లు ప్రారంభమైన కీలక సమయంలో ఈ నిధులు అందడంతో రైతులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా రైతు భరోసా పథకం ద్వారా భారీ స్థాయిలో నిధుల పంపిణీ జరిగింది. అధికారిక గణాంకాల ప్రకారం 68.37 లక్షల మంది రైతుల ఖాతాల్లో మొత్తం రూ.7,490.72 కోట్లు జమ అయినట్లు అధికారులు వెల్లడించారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడం, రైతుల పెట్టుబడి భారాన్ని తగ్గించడం లక్ష్యంగా ప్రభుత్వం ఈ పథకాన్ని కొనసాగిస్తోంది. సీజన్ ప్రారంభంలోనే నిధులు విడుదల కావడంతో వ్యవసాయ పనులకు ఇది పెద్ద ఊరటగా మారింది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

cloudburst in jammu kashmir causes landslide and road blockage in kishtwar hydro project area

Jammu and Kashmir | జమ్మూకశ్మీర్‌లో క్లౌడ్‌బరస్ట్ బీభత్సం.. బురదలో చిక్కున్న వాహనాలు

Jammu and Kashmir: జమ్మూకశ్మీర్‌లో ప్రకృతి విపత్తు తీవ్ర కలకలం సృష్టించింది. జమ్మూకశ్మీర్ కిష్టవార్ జిల్లాలోని క్వార్ హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ (540 మెగావాట్లు) ప్రాంతంలో ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత అకస్మాత్తుగా తీవ్రమైన...
- Advertisement -
Chat on WhatsApp