Thursday, July 9, 2026
Chat on WhatsApp
HomeNationalTelangana panchayats | గ్రామీణ అభివృద్ధిలో తెలంగాణ పంచాయతీల పట్టు...జాతీయ స్థాయి గుర్తింపు

Telangana panchayats | గ్రామీణ అభివృద్ధిలో తెలంగాణ పంచాయతీల పట్టు…జాతీయ స్థాయి గుర్తింపు

-

Chat on WhatsApp


Telangana panchayats: తెలంగాణ పంచాయతీలు జాతీయ స్థాయిలో మెరిసాయి. కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ప్రకటించిన ‘దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాలు’లో ఈసారి వికారాబాద్ జిల్లా మోతుకుపల్లి పంచాయతీ “గుడ్ గవర్నెన్స్” విభాగంలో జాతీయ అవార్డును అందుకుంది.

అలాగే, సంగారెడ్డి జిల్లా ఫసల్వాడి పంచాయతీ “విమెన్ ఫ్రెండ్లీ పంచాయతీ” కేటగిరీలో అత్యుత్తమ పురస్కారాన్ని పొందింది. గ్రామీణాభివృద్ధి, పారదర్శక పాలన, మహిళా సాధికారత, భద్రత మరియు సంక్షేమ పథకాల అమలులో చూపిన కృషి ఈ విజయాలకు ప్రధాన కారణాలు.

మోతుకుపల్లి, ఫసల్వాడి పంచాయతీలు ఇతర గ్రామాలకు మార్గదర్శకంగా నిలుస్తూ, గ్రామీణాభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తున్నాయి. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఆనందం ఈ విజయంపై అభినందనలు తెలిపారు.

ఇలాంటి అవార్డులు రాష్ట్రంలోని ఇతర పంచాయతీలకు ప్రేరణగా మారి, తెలంగాణ ప్రతిష్టను జాతీయ స్థాయిలో మరింత పెంచుతాయని ఆమె తెలిపారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

cobra blocks traffic on palace road in bengaluru viral video

Cobra Blocks Traffic | బెంగళూరు ట్రాఫిక్‌ను ఆపగలిగింది చివరకు ఒక కోబ్రానే..!

బెంగళూరులో ట్రాఫిక్ సమస్యలు సాధారణమే. అయితే ఈసారి ట్రాఫిక్‌కు కారణమైనది వాహనాల రద్దీ కాదు.. ఓ భారీ తాచుపాము. నగరంలోని ప్యాలెస్ రోడ్డులో చోటుచేసుకున్న ఈ ఘటన అక్కడి వాహనదారులను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా...
- Advertisement -
Chat on WhatsApp