Sunday, July 12, 2026
Chat on WhatsApp
HomeNationalRailway Gate Keeper | ఒక క్షణం ఆలస్యం అయితే ప్రాణం పోయేది.. గేట్ కీపర్...

Railway Gate Keeper | ఒక క్షణం ఆలస్యం అయితే ప్రాణం పోయేది.. గేట్ కీపర్ సాహసానికి సెల్యూట్

-

Chat on WhatsApp

Railway Gate Keeper: మైలాడుతురై జిల్లా తిరుకళుకుండ్రం సమీపంలో చోటుచేసుకున్న ఘటనలో రైల్వే గేట్ కీపర్ శాంతిప్ చూపించిన ధైర్యం అందరి ప్రశంసలు అందుకుంటోంది. వేగంగా వస్తున్న రైలు ముందు దూకి ఆత్మహత్యకు ప్రయత్నించిన(Based on Visual) ఓ వ్యక్తిని గమనించిన శాంతిప్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్పందించారు. ప్రమాదాన్ని లెక్కచేయకుండా వెంటనే పరుగెత్తుకుంటూ వెళ్లి ఆ వ్యక్తిని పట్టాల నుంచి పక్కకు లాగి ప్రాణాలను కాపాడారు. శాంతిప్ సమయస్ఫూర్తి, ధైర్యం కారణంగానే ఓ నిండు ప్రాణం నిలిచిందని పలువురు అభినందిస్తున్నారు.

రైల్వే పరిసరాల్లో అప్రమత్తత ఎంత కీలకమో ఈ ఘటన మరోసారి స్పష్టం చేసింది. ప్రమాదకర పరిస్థితుల్లో సరైన సమయంలో తీసుకునే నిర్ణయం ఒకరి జీవితాన్ని కాపాడగలదని ఈ సంఘటన తెలియజేస్తోంది. ఓ వ్యక్తి ప్రాణాలను రక్షించిన గేట్ కీపర్ శాంతిప్ సేవలను పలువురు ప్రశంసిస్తూ, ఆయనకు అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. మానవత్వం, ధైర్యానికి ఈ ఘటన ఒక గొప్ప ఉదాహరణగా నిలిచింది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

ins-mahendragiri-inducted-into-indian-navy-rajnath-singh

Rajnath Singh | సముద్రంలో భారత్‌కు తిరుగులేదు.. రాజ్‌నాథ్ సింగ్ కీలక ప్రకటన

Rajnath Singh: భారత సముద్ర భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా మరో కీలక అడుగు పడింది. విశాఖపట్నంలోని నావల్ డాక్‌యార్డ్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి భారత నౌకాదళంలో కొత్తగా...
- Advertisement -
Chat on WhatsApp