Thursday, July 16, 2026
Chat on WhatsApp
HomeTelanganaGandhi Bhavan | ప్రతి ఓటును కాపాడుకోవాలి పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్

Gandhi Bhavan | ప్రతి ఓటును కాపాడుకోవాలి పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్

-

Chat on WhatsApp

Gandhi Bhavan: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. మిగిలిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ ప్రక్రియను ఈసీ తాజాగా ప్రారంభించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తన నేతలకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించింది.

హైదరాబాద్ గాంధీ భవన్‌లో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ పాల్గొన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో మాస్టర్ ట్రైనీలకు ఏఐసీసీ శిక్షణ విభాగానికి చెందిన సౌరభ్, అనూష, నిశాంత్ శిక్షణ అందిస్తున్నారు. శిక్షణ పొందిన మాస్టర్ ట్రైనీలు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో బూత్ లెవల్ ఏజెంట్లకు (BLA) శిక్షణ ఇవ్వనున్నారు.

ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి “సంఘటన్ సృజన్ అభియాన్” కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. జిల్లా, మండల కమిటీల ఏర్పాటు దాదాపు పూర్తయిందని ఆయన పేర్కొన్నారు.

పశ్చిమ బెంగాల్‌లో 93 లక్షల ఓట్లు తొలగించారని, అక్కడ బీజేపీ కుట్రల కారణంగా రాజకీయ పరిస్థితులు మారిపోయాయని ఆయన ఆరోపించారు. తెలంగాణలో అలాంటి పరిస్థితులు రాకుండా ప్రతి ఓటును కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన స్పష్టం చేశారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

mega star chiranjeevi

Chiranjeevi: ముద్రగడ పద్మనాభంది రాజీపడని వ్యక్తిత్వం.. చిరంజీవి భావోద్వేగ వ్యాఖ్యలు 

కాపు ఉద్యమానికి చిరునామాగా నిలిచిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం (73) మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన...
- Advertisement -
Chat on WhatsApp