Tuesday, July 14, 2026
Chat on WhatsApp
HomeTelangana‘RAW NTR’ ఎవరి సంస్థ? ఎన్టీఆర్ టీమ్ ఇచ్చిన స్పష్టమైన సమాధానం

‘RAW NTR’ ఎవరి సంస్థ? ఎన్టీఆర్ టీమ్ ఇచ్చిన స్పష్టమైన సమాధానం

-

Chat on WhatsApp

ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశంపై జరుగుతున్న ప్రచారాలకు ఆయన కార్యాలయం స్పష్టమైన వివరణ ఇచ్చింది. ‘RAW NTR’ అనే సంస్థతో తమకు ఎలాంటి సంబంధం లేదని అధికారికంగా ప్రకటించింది. ఎన్టీఆర్ పేరుతో ప్రకటనలు విడుదల చేయడానికి లేదా కార్యక్రమాలు నిర్వహించడానికి ఆ సంస్థకు ఎలాంటి అనుమతి, అధికారం లేదని స్పష్టం చేసింది. ఎన్టీఆర్‌కు సంబంధించిన సేవా కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు లేదా ఇతర ముఖ్యమైన విషయాలపై సమాచారం కేవలం ఎన్టీఆర్ లేదా ఆయన అధికారిక బృందం నుంచి మాత్రమే వెలువడుతుందని కార్యాలయం తెలిపింది. ఈ అంశంపై ఇదే తమ తుది వివరణ అని పేర్కొంది.

అదేవిధంగా మీడియా సంస్థలు, డిజిటల్ మీడియా వేదికలు, సోషల్ మీడియా నిర్వాహకులు, అభిమానులు ధృవీకరణ లేని వార్తలను ప్రచారం చేయవద్దని విజ్ఞప్తి చేసింది. అధికారిక వర్గాల నుంచి వచ్చే సమాచారాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. ఇటీవల ఎన్టీఆర్ ఈ నెల 18న రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారంటూ సోషల్ మీడియాతో పాటు పలు వేదికల్లో ప్రచారం జరిగింది.

దీంతో ఆయన రాజకీయ ప్రయాణంపై అభిమానులు, రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో ఆ ప్రచారాలకు ముగింపు పలికే ఉద్దేశంతో ఎన్టీఆర్ కార్యాలయం ప్రకటన విడుదల చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశంపై వస్తున్న వార్తలకు ఎలాంటి అధికారిక నిర్ధారణ లేదని తాజా ప్రకటన ద్వారా స్పష్టమైంది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

devendra fadnavis visits pawan kalyan after shoulder surgery in mumbai hospital

Devendra Fadnavis | పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై ఫడణవీస్ ఆరా.. త్వరగా కోలుకోవాలని...

Devendra Fadnavis: మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను కలిశారు. ముంబయిలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో భుజ శస్త్రచికిత్స అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న పవన్ కళ్యాణ్‌ను దేవేంద్ర ఫడణవీస్ పరామర్శించి,...
- Advertisement -
Chat on WhatsApp