Monday, February 23, 2026
No menu items!
spot_img
HomeFilms NewsVaranasi Release Date | వారణాసి రిలీజ్ డేట్ ఫిక్స్.. 2027 ఏప్రిల్ 7న సినిమా...

Varanasi Release Date | వారణాసి రిలీజ్ డేట్ ఫిక్స్.. 2027 ఏప్రిల్ 7న సినిమా విడుదల

SS Rajamouli-Varanasi: దర్శకధీరుడు రాజమౌళి అయన ప్రోమోషన్స్ ఎలా ఉంటాయో ఊహ కి అందవు.మహేష్ బాబుతో తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ‘వారణాసి’ విడుదల తేదీపై ఎట్టకేలకు స్పష్టత వచ్చింది. మహేశ్ బాబు హీరోగా రూపొందుతున్న ఈ పాన్ వరల్డ్ మూవీని “2027 ఏప్రిల్ 7న“(Varanasi Release Date) ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు రాజమౌళి అధికారికంగా ప్రకటించారు.

ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అభిమానుల పండగ ముందే మొదలైంది. ఇటీవల వారణాసిలో 2027 ఏప్రిల్ 7 తేదీతో కూడిన హోర్డింగులు కనిపించడంతో సినిమా రిలీజ్ డేట్ ఇదేనంటూ సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరిగింది.

గ్లింప్స్ ఈవెంట్‌లో 2027 వేసవిలో రిలీజ్ అని చెప్పిన చిత్రబృందం, ఇప్పుడు ఏప్రిల్ 7నే ఖరారు చేసింది. ఉగాది, గుడిపడ్వా సందర్భంగా విడుదల కావడంతో పాటు, ఆ తర్వాత అంబేడ్కర్ జయంతి, శ్రీరామ నవమి వంటి వరుస సెలవులు ఉండటం సినిమాకు ప్లస్‌గా మారనుంది.

భారీ బడ్జెట్, అత్యున్నత స్థాయి విజువల్ ఎఫెక్ట్స్‌తో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. తదుపరి షెడ్యూల్‌ను అంటార్కిటికాలో ప్లాన్ చేసినట్లు సమాచారం. అక్కడ షూటింగ్ జరిగితే, అంటార్కిటికాలో చిత్రీకరించిన తొలి భారతీయ సినిమాగా ‘వారణాసి’ చరిత్ర సృష్టించనుంది. పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంకా చోప్రా కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం 120 దేశాల్లో విడుదలై మరో రికార్డ్ నెలకొల్పనుంది.

also read:నిఫా వైరస్‌పై భయాలు అక్కర్లేదు: WHO క్లారిటీ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular