SIM Card Misuse Alert | సిమ్‌కార్డులను ఇతరులకు ఇవ్వడం నేరం: డాట్ హెచ్చరిక

DoT issues warning on SIM card misuse and IMEI tampering in India DoT issues warning on SIM card misuse and IMEI tampering in India

సిమ్‌కార్డులను ఇతరులకు ఇవ్వడం నేరం: డాట్ హెచ్చరిక
ఢిల్లీ  టెలికాం శాఖ (DoT guidelines) సిమ్‌కార్డుల దుర్వినియోగంపై కీలక ప్రకటన విడుదల చేసింది. సిమ్‌కార్డులు ఎడాపెడా కొనుగోలు చేసి వాడకుండా ఇతరులకు ఇవ్వడం చట్టపరంగా ప్రమాదకరమని తెలిపింది.

మీ పేరుమీద కొనుగోలు చేసిన సిమ్ నంబర్ సైబర్ మోసాల(Cyber crimes)కు లేదా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు వాడితే, ఆ నేరానికి సంబంధించి సిమ్‌కార్డు యజమానికీ బాధ్యత ఉండనుందని డాట్ స్పష్టం చేసింది.

IMEI ట్యాంపరింగ్‌పై జైలు, భారీ జరిమానా

IMEI మార్చిన మోడెమ్‌లు, సిమ్‌బాక్సులు, మాడ్యూల్స్‌ను కొనడం లేదా వినియోగించడం నేరమని డాట్ పేర్కొంది. నకిలీ పత్రాలతో సిమ్‌కార్డులు తీసుకోవడమూ, వాటిని ఇతరులకు ఇవ్వడమూ చట్టవిరుద్ధం.

టెలికమ్యూనికేషన్స్ చట్టం 2023 ప్రకారం IMEI మార్పు చేస్తే మూడు సంవత్సరాల వరకు జైలు, రూ.50 లక్షల వరకు జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంది.

ALSO READ:YS Jagan Pulivendula Tour: నేడు పులివెందుకు  వైఎస్ జగన్


IMEI తనిఖీ ఎలా చేయాలి?

టెలికమ్యూనికేషన్స్ రూల్స్ 2024 ప్రకారం, IMEI మార్చిన డివైజులను వాడడం పూర్తిగా నిషేధం. పౌరులు తమ డివైజుల IMEI వివరాలను సంచార్ సాథి వెబ్‌సైట్ లేదా యాప్‌లో తనిఖీ చేసుకోవచ్చని డాట్ సూచించింది.

IMEI ఎంటర్ చేస్తే బ్రాండ్, మోడల్, తయారీ వివరాలు వెంటనే కనిపిస్తాయని వెల్లడించింది.

టెలికాం వనరుల దుర్వినియోగాన్ని అరికట్టే చర్యలు

టెలికాం గుర్తింపులను మార్చే యాప్‌లు, వెబ్‌సైట్ల వినియోగం ప్రమాదకరమని హెచ్చరిస్తూ, టెలికాం వనరుల దుర్వినియోగాన్ని నిరోధించి సురక్షిత టెలికమ్యూనికేషన్ పర్యావరణాన్ని ఏర్పరిచేందుకు ప్రభుత్వం కఠిన తనిఖీలు అమలు చేస్తుందని డాట్ పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *