ముంబై ఇండియన్స్ ప్లేయర్ షెర్ఫేన్ రూథర్‌ఫర్డ్ కుమారుడి(Sherfane Rutherford’s son)కి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ధర్మశాల ఎయిర్‌పోర్టులో తండ్రి ట్రావెల్ బ్యాగ్‌ను లాక్కుంటూ చిన్నారి చేసిన క్యూట్ హావభావాలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఈ వీడియోను చూసిన నెటిజన్లు చిన్నారి అమాయకత్వానికి ఫిదా అవుతున్నారు.
అంతకుముందు మరో సందర్భంలో రూథర్‌ఫర్డ్ కుమారుడు భారత జట్టు ప్లేయర్ రోహిత్ శర్మతో కలిసి ఫోటో దిగాడు. చేతిలో లాలీపాప్ పట్టుకుని ఎంతో క్యూట్‌గా కనిపించిన ఈ చిన్నారి ఫొటోను రూథర్‌ఫర్డ్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశారు. దీంతో అభిమానులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు.
“అరే ఈ బుడ్డోడు ఎంత ముద్దుగా ఉన్నాడు బ్రో” అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు “రోహిత్‌తో చిన్నారి ఫోటో చాలా క్యూట్‌గా ఉంది” అని రాస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారి క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఐపీఎల్ సందర్భంగా ఆటగాళ్ల వ్యక్తిగత క్షణాలు కూడా అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
Sherfane Rutherford’s son | “ఈ బుడ్డోడు చాలా ముద్దుగా ఉన్నాడు బ్రో”.. నెటిజన్ల కామెంట్స్ వైరల్
-








