Sunday, March 8, 2026
No menu items!
Google search engine
HomeBusinessSamsung Galaxy S26 Ultra | గెలాక్సీ అన్‌ప్యాక్డ్ 2026లో S26 సిరీస్ ఆవిష్కరణ

Samsung Galaxy S26 Ultra | గెలాక్సీ అన్‌ప్యాక్డ్ 2026లో S26 సిరీస్ ఆవిష్కరణ

- Advertisement -
Google search engine

Samsung Galaxy S26 Ultra: దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ శాంసంగ్‌ తన తాజా ఎస్‌26 సిరీస్‌ను శాన్‌ఫ్రాన్సిస్కోలో జరిగిన గెలాక్సీ అన్‌ప్యాక్డ్ (Galaxy Unpacked 2026) కార్యక్రమంలో ఆవిష్కరించింది.

ఈ సిరీస్‌లో ప్రధాన ఆకర్షణగా Samsung Galaxy S26 Ultra నిలిచింది. 6.9 అంగుళాల డైనమిక్ అమోలెడ్ 2ఎక్స్ డిస్‌ప్లేతో వచ్చిన ఈ ఫోన్‌లో ‘ప్రైవసీ డిస్‌ప్లే’ ప్రత్యేక ఫీచర్ అందించారు.

పక్కన ఉన్నవారు స్క్రీన్‌ను స్పష్టంగా చూడకుండా పరిమితం చేసే సాంకేతికత ఇది. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జనరేషన్ 5 ప్రాసెసర్, 200 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా వ్యవస్థ, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి అత్యాధునిక లక్షణాలు ఉన్నాయి. ధర రూ.1,39,999 నుంచి ప్రారంభమై, టాప్ వేరియంట్ రూ.1,89,999 వరకు ఉంది.

గెలాక్సీ ఎస్‌26 ప్లస్‌లో 6.7 అంగుళాల డిస్‌ప్లే, 4900 ఎంఏహెచ్ బ్యాటరీ, 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా ఉన్నాయి. ప్రారంభ ధర రూ.1,19,999. బేస్ మోడల్ గెలాక్సీ ఎస్‌26లో 6.3 అంగుళాల డిస్‌ప్లే, 4300 ఎంఏహెచ్ బ్యాటరీ, 50 మెగాపిక్సెల్ కెమెరా ఉండగా, ధర రూ.87,999 నుంచి ప్రారంభమవుతుంది. ప్రీబుకింగ్ చేసిన వారికి ప్రత్యేక ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

ALSO READ:Mind control patent | మైండ్ కంట్రోల్ టెక్నాలజీ నిజమా? వైరల్ పేటెంట్ వెనుక వాస్తవం

- Advertisement -
Google search engine
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular