హీరో సాయి ధరమ్ తేజ్ తన పెళ్లి విషయంపై క్లారిటీ ఇచ్చాడు.వచ్చే సంవత్సరంలోనే తన పెళ్లి(Sai Dharam Tej Wedding) జరుగబోతుందని, త్వరలోనే పూర్తి వివరాలను తెలియజేస్తానని తెలిపారు. తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయన, కుటుంబ సభ్యులు మరియు అభిమానుల ఆశీస్సులతో కొత్త జీవితానికి సిద్ధమవుతున్నానని ప్రకటించారు.
ALSO READ:మహిళలతో అక్రమ సంబంధం…కొట్టి చంపిన కుటుంబ సభ్యులు
సాయి ధరమ్ తేజ్(sai dharam tej) చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి.ఆయన పెళ్లి ఎవరితో జరుగుతుందన్న ఆసక్తి ఇప్పటికే సినీ వర్గాల్లో, ఫ్యాన్ సర్కిల్స్‌లో పెరిగింది.
తేజ్ కుటుంబం మెగా ఫ్యామిలీలో ఉన్న గుర్తింపు, అభిమానుల భారీ బేస్ కారణంగా ఈ వివాహంపై ప్రత్యేక దృష్టి నిలిచింది. పెళ్లి తేదీ, ప్రాంగణం, వధువు వివరాలు త్వరలో అధికారికంగా వెల్లడించనున్నట్లు సూచనలు ఉన్నాయి.
