ఐపీఎల్ 2025 (18వ సీజన్)లో కామెంటేటర్‌గా ఉన్న అంబటి రాయుడు, మాజీ ఆటగాడిగా తన అభిప్రాయాలతో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపోయాడు. ఆయన గతంలో ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడారు. ప్రస్తుతం కామెంటరీలో సీఎస్‌కే, ముఖ్యంగా ఎంఎస్ ధోనీకి మద్దతుగా మాట్లాడుతున్నాడని నెటిజన్లు విమర్శిస్తున్నారు.
రాయుడు తాను ధోనీకి ఎప్పుడు మద్దతుగా ఉండటమే తప్పు కాదు అని, ఎవరి మాటలకు తాను భయపడనని తేల్చిచెప్పాడు. “నేనెప్పటికీ తలా అభిమానినే, ఎవరేమన్నా పర్లేదు, ఏం చేసినా నేను మార్చనని” అంటూ ఓ బలమైన సందేశాన్ని ఎక్స్ వేదికగా ఇచ్చాడు.
ఇంతటితో ఆగక, “పెయిడ్ పీఆర్ కోసం డబ్బులు ఖర్చు చేయకండి. ఆ డబ్బును పేదలకు విరాళంగా ఇవ్వండి” అంటూ ట్రోల్స్‌పై కౌంటర్ ఇచ్చాడు. తన అభిప్రాయాలు నిజాయతీగా ఉంటాయని, అతని అభిమానాన్ని ఏదీ కదిలించలేదని చాటిచెప్పాడు.
ఈ ట్వీట్‌కు అభిమానుల నుంచి భారీ స్పందన వస్తోంది. చాలామంది రాయుడి ధైర్యాన్ని ప్రశంసిస్తున్నారు. మరోవైపు, సోషల్ మీడియాలో అతని వ్యాఖ్యలపై మద్దతు, వ్యతిరేకత కలగలిపిన స్పందనలు వస్తున్నాయి.