Rapido food delivery: ప్రయాణ సేవల రంగంలో ముందంజలో ఉన్న ర్యాపిడో (Rapido) ఇప్పుడు ఫుడ్ డెలివరీ రంగంలోకి అడుగుపెట్టింది. ఇందుకోసం ‘ఓన్‌లీ’ అనే కొత్త యాప్‌ను ప్రారంభించింది. ఈ యాప్ ప్రత్యేకత ఏమిటంటే, రెస్టారెంట్ల నుంచి ఎలాంటి కమీషన్ వసూలు చేయబోదని సంస్థ ప్రకటించింది.
సాధారణంగా ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లు రెస్టారెంట్లపై భారీ కమీషన్‌లు విధిస్తాయి. కానీ ఓన్‌లీ మోడల్ పూర్తిగా భిన్నంగా ఉంటుందని ర్యాపిడో వెల్లడించింది.
కస్టమర్లు కేవలం ఆహార ధరతో పాటు డెలివరీ కోసం అయ్యే రవాణా ఖర్చు మాత్రమే చెల్లిస్తే సరిపోతుందని తెలిపింది. ప్లాట్‌ఫామ్ ఫీజులు, మెనూ ధరల పెంపు వంటి అదనపు ఛార్జీలు ఉండవని స్పష్టం చేసింది. దీని వల్ల రెస్టారెంట్లకు లాభదాయకం కావడంతో పాటు వినియోగదారులకు తక్కువ ధరలో ఆహారం అందే అవకాశముంది.
ప్రస్తుతం ఈ సేవలను బెంగళూరు లో ప్రారంభించారు. అక్కడి స్పందనను బట్టి త్వరలోనే ఇతర నగరాలకు విస్తరించనున్నట్లు సమాచారం.
ఇప్పటికే బైక్, కార్ రైడింగ్ సేవలతో విస్తృత నెట్‌వర్క్ కలిగిన ర్యాపిడో, అదే మౌలిక వసతులను ఫుడ్ డెలివరీకి వినియోగించనుంది. దీంతో మార్కెట్‌లో పోటీ మరింత పెరగనున్నట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.









