Thursday, July 16, 2026
Chat on WhatsApp
HomeNationalRajnath Singh | 1971 యుద్ధాన్ని గుర్తు చేసిన రాజ్‌నాథ్...వార్నింగ్ ఇస్తూ...చరిత్ర రిపీట్ అవుద్ది

Rajnath Singh | 1971 యుద్ధాన్ని గుర్తు చేసిన రాజ్‌నాథ్…వార్నింగ్ ఇస్తూ…చరిత్ర రిపీట్ అవుద్ది

-

Chat on WhatsApp

Rajnath Singh: పాకిస్థాన్‌ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్‌ కోల్‌కతాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై భారత రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ తీవ్రంగా స్పందించారు. “బెంగాల్‌పై కన్నేస్తే, ఈసారి పాకిస్థాన్ ఎన్ని ముక్కలవుతుందో దేవుడికే తెలియాలి” అంటూ ఘాటు హెచ్చరిక జారీ చేశారు.

1971 యుద్ధాన్ని గుర్తు చేస్తూ, అప్పట్లో పాకిస్థాన్ రెండు భాగాలై, తూర్పు పాకిస్థాన్ విడిపోయి బాంగ్లాదేశ్గా అవతరించిందని ఆయన పేర్కొన్నారు. ఈసారి కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే దాని ఫలితాలు తీవ్రంగా ఉంటాయని స్పష్టం చేశారు.

ఇటీవల ఖవాజా ఆసిఫ్ “భారత్ భవిష్యత్తులో ఏదైనా చర్యకు దిగితే, ప్రతిస్పందన కోల్‌కతా వరకూ తీసుకెళ్తాం” అని వ్యాఖ్యానించడం ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ వ్యాఖ్యలపై భారత రాజకీయ వర్గాల్లో తీవ్ర ప్రతిస్పందన వ్యక్తమైంది.

ఒక ఇంటర్వ్యూలో స్పందించిన రాజ్‌నాథ్ సింగ్, ఇలాంటి రెచ్చగొట్టే ప్రకటనలు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచుతాయని హెచ్చరించారు. పాకిస్థాన్ బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని, లేకపోతే 1971 తరహా పరిణామాలు మళ్లీ గుర్తుకు వచ్చే పరిస్థితి తలెత్తవచ్చని పేర్కొన్నారు.

రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యల్లో మరో కీలక అంశం “చరిత్ర రిపీట్” హెచ్చరిక. పొరుగు దేశాల మధ్య ఉద్రిక్తతలను పెంచే బదులు, శాంతి, స్థిరత్వం కోసం పని చేయాలని ఆయన పాకిస్థాన్‌కు సూచించారు. బెంగాల్ లేదా భారత భూభాగంపై ఎలాంటి దుష్టచర్యలకైనా దేశం గట్టిగా ప్రతిస్పందిస్తుందని సంకేతమిచ్చారు.

దీంతో భారత్-పాక్ మధ్య మరోసారి మాటల యుద్ధం వేడెక్కింది. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య రక్షణ, సరిహద్దు భద్రత, రాజకీయ వ్యాఖ్యల చుట్టూ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

mega star chiranjeevi

Chiranjeevi: ముద్రగడ పద్మనాభంది రాజీపడని వ్యక్తిత్వం.. చిరంజీవి భావోద్వేగ వ్యాఖ్యలు 

కాపు ఉద్యమానికి చిరునామాగా నిలిచిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం (73) మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన...
- Advertisement -
Chat on WhatsApp