ఆయ్యగారే నెంబర్ వన్ అనే డైలాగ్ ఇప్పటికైనా నిజం అవుతుందా కాదా అని అక్కినేని ఫాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సందర్భంలో తాజాగా రిలీజ్ అయినా టీజర్ అక్కినేని అఖిల్ నటిస్తున్న ‘లెనిన్’(Lenin teaser) టీజర్‌ను మేకర్స్ ఎలాంటి ముందస్తు అనౌన్స్‌మెంట్ లేకుండా విడుదల చేసి అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు. సాధారణంగా టాలీవుడ్‌లో ప్రతి అప్డేట్‌కు ముందుగా ప్రకటన వస్తుండగా, ఈసారి మాత్రం సడన్‌గా టీజర్ రిలీజ్ చేయడం ఫ్యాన్స్‌లో ఆసక్తి పెంచింది.
గ్రామీణ ప్రేమకథ నేపథ్యంతో వచ్చిన ఈ టీజర్‌లో అఖిల్ అక్కినేని, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మధ్య కెమిస్ట్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇద్దరి మధ్య ఉన్న క్యూట్ సీన్స్, లవ్ ట్రాక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
మే 23 అక్కినేని కుటుంబానికి ప్రత్యేకమైన రోజు కావడంతో అదే రోజున టీజర్ విడుదల చేసినట్లు తెలుస్తోంది. ఇదే రోజున అక్కినేని నాగేశ్వరరావు నటించిన చివరి చిత్రం ‘మనం’ విడుదలైన విషయం కూడా గుర్తుచేస్తున్నారు. ఆ స్మరణార్థంగానే ‘లెనిన్’ టీజర్ రిలీజ్ చేశారని సమాచారం.
“లెనిన్ – మనోడు వస్తున్నాడు” అనే ట్యాగ్‌లైన్‌తో వచ్చిన ఈ టీజర్‌లో గ్రామీణ వాతావరణం, ప్రేమకథతో పాటు చివర్లో యాక్షన్ ఎలిమెంట్స్ కూడా చూపించారు. దీంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
ఈ సినిమాలో అఖిల్, భాగ్యశ్రీ రాయలసీమ యాసలో మాట్లాడటం ప్రత్యేకంగా నిలుస్తోంది. గ్రామీణ యువకుడు, యువతి పాత్రల్లో వారి లుక్ కూడా న్యాచురల్‌గా కనిపిస్తోంది.
సినిమాలో శివాజీ, శరణ్య ప్రదీప్ కీలక పాత్రల్లో నటిస్తుండగా, ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ‘లెనిన్’ టీజర్ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ అందుకుంటోంది.
Lenin teaser | గ్రామీణ ప్రేమకథతో ఆకట్టుకున్న అఖిల్ ‘లెనిన్’ టీజర్… ఈసారైనా హిట్ కొడతాడా ?
-








