Tuesday, March 3, 2026
No menu items!
Google search engine
HomeFilms NewsRahul Sipligunj Wedding | అంగరంగ వైభవంగా సింగర్ రాహుల్ సిప్లిగంజ్ వెడ్డింగ్

Rahul Sipligunj Wedding | అంగరంగ వైభవంగా సింగర్ రాహుల్ సిప్లిగంజ్ వెడ్డింగ్

- Advertisement -
Google search engine

Rahul Sipligunj Wedding: టాలీవుడ్‌లో  ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్(Rahul Sipligunj)ఒక ఇంటివాడు అయ్యాడు తన ప్రేయసి హరిణ్య(Harinya)ను నవంబర్ 27న వివాహం చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు.

గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట, కుటుంబ సభ్యుల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం వీరి వివాహ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి.

ALSO READ:నర్సాపూర్ కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ.. బీఆర్ఎస్ గూటికి కీలక నేతలు


“నాటు నాటు” పాటకు ఆస్కార్ అవార్డు(Oscar) రావడం రాహుల్‌ కెరీర్‌కు పెద్ద మైలురాయిగా నిలిచింది. వ్యక్తిగత జీవితంలో హరిణ్యతో ఆయన ప్రేమ విషయం చాలాకాలంగా ఇండస్ట్రీలో చర్చగా నిలిచింది.

హరిణ్య రాజకీయ కుటుంబానికి చెందిన యువతి కాగా, రెండు నెలల క్రితం వీరిద్దరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. తాజా పెళ్లి వేడుకలో సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నట్లు సమాచారం. అధికారిక ఫోటోలు విడుదల కాకపోయినా, సోషల్ మీడియాలో కనిపించిన చిత్రాలు ట్రెండింగ్‌లో నిలుస్తున్నాయి.

సంప్రదాయ దుస్తుల్లో జరిగిన ఈ వివాహం ఎంతో అందంగా, రీతిగా జరిగిందని తెలుస్తోంది. రాహుల్–హరిణ్యపై నెటిజన్లు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వారి ప్రీ-వెడ్డింగ్ కార్యక్రమాలైన మెహందీ, హల్ది వేడుకల ఫోటోలు కూడా పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి.

YouTube thumbnailYouTube icon
- Advertisement -
Google search engine
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular