Sunday, July 12, 2026
Chat on WhatsApp
HomeTelanganaHyderabadPhone Tapping Case | హైదరాబాద్‌లోనే విచారణకు హాజరుకావచ్చు: కేసీఆర్‌కు సిట్ సూచన

Phone Tapping Case | హైదరాబాద్‌లోనే విచారణకు హాజరుకావచ్చు: కేసీఆర్‌కు సిట్ సూచన

-

Chat on WhatsApp

Phone Tapping Case: ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరం అవుతోంది. ఈ కేసులో తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌(KCR)కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. నందినగర్‌లోని ఆయన నివాసానికి వెళ్లిన సిట్ బృందం నేరుగా నోటీసులను అందజేసింది.

నోటీసుల్లో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరుకావాలని పేర్కొన్నారు. అయితే కేసీఆర్ వయస్సు 65 సంవత్సరాలు కావడంతో పోలీస్ స్టేషన్‌కు రావాల్సిన అవసరం లేదని సిట్ స్పష్టం చేసింది. విచారణకు అనుకూలంగా హైదరాబాద్ నగర పరిధిలోని ఏదైనా ప్రాంతాన్ని సూచించాలని కేసీఆర్‌ను కోరింది.

ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)లో ఇప్పటికే పలువురు కీలక నేతలను సిట్ విచారించిన విషయం తెలిసిందే. మాజీ మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్‌తో పాటు మాజీ ఎంపీ సంతోష్ రావును సిట్ అధికారులు ప్రశ్నించారు.

తాజాగా కేసీఆర్‌కు నోటీసులు జారీ కావడంతో ఈ కేసు రాజకీయంగా మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. రానున్న రోజుల్లో ఈ వ్యవహారం ఎలాంటి మలుపులు తిరుగుతుందో అన్నది ఆసక్తికరంగా మారింది.

ALSO READ:Viral Cricket Dog | క్రికెట్ మ్యాచ్‌లో కుక్క ఉత్సాహం

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

ins-mahendragiri-inducted-into-indian-navy-rajnath-singh

Rajnath Singh | సముద్రంలో భారత్‌కు తిరుగులేదు.. రాజ్‌నాథ్ సింగ్ కీలక ప్రకటన

Rajnath Singh: భారత సముద్ర భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా మరో కీలక అడుగు పడింది. విశాఖపట్నంలోని నావల్ డాక్‌యార్డ్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి భారత నౌకాదళంలో కొత్తగా...
- Advertisement -
Chat on WhatsApp