TTD Parakamani Case: పరకామణి కేసు దర్యాప్తు వేగవంతం అవుతున్న నేపథ్యంలో టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి (YV Subba Reddy) ఈరోజు విజయవాడలోని సీఐడీ కార్యాలయానికి హాజరయ్యారు. ఆయనను అడిషనల్ డీజీ రవి శంకర్ అయ్యన్నర్ ప్రశ్నిస్తున్నారు. కేసు సంబంధిత వివరాలను సేకరించేందుకు సీఐడీ ప్రత్యేకంగా విచారణ కొనసాగిస్తోంది.
ఇటీవల ఇదే కేసులో టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి మరియు సీఎస్‌వో నరసింహ కిషోర్‌ల నుంచి స్టేట్‌మెంట్‌లు రికార్డ్ చేసిన సీఐడీ, ఇప్పుడు సుబ్బారెడ్డిని కూడా ప్రశ్నిస్తోంది. విచారణలో భాగంగా తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి కేసుకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లు సీఐడీ కార్యాలయానికి తెప్పించారు.
డిసెంబర్ 2వ తేదీలోపు ఈ కేసుపై పూర్తిస్థాయి నివేదికను ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు సమర్పించాల్సి ఉండటంతో సీఐడీ దర్యాప్తును మరింత ముమ్మరం చేసింది. పరకామణి కేసు(Parakamani Scam)లో ఉన్న అనుమానాస్పద అంశాలను స్పష్టంచేసేందుకు అధికారులు వరుస ప్రశ్నలు అడుగుతున్నట్టు సమాచారం.
