Narendra Modi: ప్రధాని నరేంద్ర మోడీకి సామాజిక మాధ్యమాల్లో అపారమైన ఆదరణ లభిస్తోంది. తాజాగా ఇంస్టాగ్రామ్ (Instagram)లో ఆయనను అనుసరించే వారి సంఖ్య 10 కోట్ల మైలురాయిని దాటింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఫాలోవర్లు కలిగిన రాజకీయ నాయకుడిగా మోడీ రికార్డు సృష్టించారు.
2014లో ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగుపెట్టిన ఆయన, తన అధికారిక ఖాతా ద్వారా ప్రభుత్వ కార్యక్రమాలు, విదేశీ పర్యటనలు, వ్యక్తిగత క్షణాలను పంచుకుంటూ ప్రజలతో అనుసంధానమవుతున్నారు.
ఇతర నాయకులతో పోలిస్తే మోడీకి ఎక్కువ ఫాలోవర్స్ తో ముందున్నారు.అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు సుమారు 4.3 కోట్ల ఫాలోవర్లు ఉండగా, ఇండోనేసియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో కు 1.5 కోట్లు, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా కు 1.4 కోట్లకు పైగా, తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగాన్‌కు 1.1 కోట్లు, అర్జెంటీనా అధ్యక్షుడు హవియేర్ మిలే కు 64 లక్షల ఫాలోవర్లు ఉన్నారు.
ఇక కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul gandhi) ను ఇన్‌స్టాగ్రామ్‌లో 1.2 కోట్లకు పైగా మంది అనుసరిస్తున్నారు. ఈ గణాంకాలు మోదీ డిజిటల్ ప్రభావాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాయి.
ALSO READ:Samsung Galaxy S26 Ultra | గెలాక్సీ అన్‌ప్యాక్డ్ 2026లో S26 సిరీస్ ఆవిష్కరణ








