Monday, February 23, 2026
No menu items!
spot_img
HomeNationalమహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌కు పాకిస్థాన్ నుంచి బెదిరింపు

మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌కు పాకిస్థాన్ నుంచి బెదిరింపు

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు పాకిస్థాన్ నంబర్ నుంచి బెదిరింపు సందేశం వచ్చింది. శుక్రవారం ఉదయం ముంబై ట్రాఫిక్ పోలీసులకు వాట్సాప్ ద్వారా సందేశం రాగా, ముఖ్యమంత్రి కార్యాలయాన్ని పేల్చేస్తామంటూ అందులో హెచ్చరించారు. ఈ మెసేజ్‌ను మాలిక్ షాబాజ్ హుమాయున్ అనే వ్యక్తి పంపినట్టు గుర్తించారు.

బెదిరింపు సందేశం నేపథ్యంలో మహారాష్ట్ర పోలీసులు అప్రమత్తమయ్యారు. ముఖ్యమంత్రి నివాసం, సీఎం క్యాంపు కార్యాలయం, ఇతర కీలక ప్రభుత్వ భవనాల వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

పాకిస్థాన్ నుంచి వచ్చిన ఈ బెదిరింపు సందేశంపై కేంద్ర సంస్థలు కూడా ఆరా తీస్తున్నాయి. నిందితుడి వివరాలను గుర్తించేందుకు ముంబై క్రైమ్ బ్రాంచ్, ఇంటెలిజెన్స్ బ్యూరో సంయుక్తంగా పనిచేస్తున్నాయి. పాకిస్థాన్ నంబర్ నుంచి ఇలాంటి సందేశం రావడం ఆందోళన కలిగించిందని అధికారులు తెలిపారు.

భద్రతా విభాగం ఈ బెదిరింపులను సీరియస్‌గా తీసుకుని ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పటికే పలువురు అనుమానితులపై విచారణ జరుపుతున్నారు. సీఎం భద్రత విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోకుండా పోలీసులు అన్ని చర్యలు చేపట్టారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular